Juhi Chawla Reveals Marriage Secrets: 90స్ కాలం నాటి గ్లామరస్ క్వీన్, టాలీవుడ్‌లో నాగార్జున సరసన 'విక్కీదాదా' వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా. వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సీనియర్ కథానాయిక, తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడూ మీడియా కంట పడకుండా గోప్యంగా ఉంచుకోవడానికే మొగ్గుచూపారు.

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, మెహతా గ్రూప్ ఛైర్మన్ జే మెహతాను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె తన కుటుంబ విషయాలను అంతగా బయటకు రానివ్వలేదు. ఇటీవల గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో జూహీ పాల్గొని, తన పెళ్లి నాటి సంఘటనలు, ఆ సమయంలో ఎదురైన భావోద్వేగాల గురించి మనసు విప్పి మాట్లాడారు.
2000 మందికి ఆహ్వానాలు.. ఉన్నపళంగా ఆగిపోయిన గ్రాండ్ వెడ్డింగ్
దర్శకుడు రాకేష్ రోషన్ ద్వారా జే మెహతా, జూహీ చావ్లా మొదటిసారి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. సుమారు 2000 మంది ప్రముఖులతో అత్యంత వైభవంగా వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
వారందరికి ఆహ్వాన పత్రికలు కూడా వెళ్లాయి. అయితే ఆ సమయంలోనే జూహీ తల్లి హఠాన్మరణం చెందారు. ఆ తీవ్రమైన విషాదం నుంచి కోలుకోకముందే వివాహ తేదీ దగ్గరపడటంతో జూహీ మానసిక ఆందోళనకు గురయ్యారు.
"నాకు అత్యంత ప్రియమైన అమ్మ దూరమైంది. దానికితోడు అప్పుడే నా కెరీర్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో నటిస్తున్నాను. పెళ్లి చేసుకుంటే నా సినీ కెరీర్ ముగిసిపోతుందేమోనన్న భయం నన్ను తీవ్రంగా వేధించింది. ఈ సంతోషకరమైన ఘట్టాన్ని ఎలా ఆస్వాదించాలో అర్థం కాక ఒకరోజు అత్తగారి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాను" అని జూహీ చావ్లా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
అత్తగారి ఉదారత.. కోడలి మనసుకు పెద్దపీట
జూహీ పడుతున్న ఆవేదనను చూసి అత్తగారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందికి వివాహ ఆహ్వాన పత్రికలు వెళ్లినప్పటికీ, జూహీ మానసిక ప్రశాంతత కోసం గ్రాండ్గా జరగాల్సిన ఆ వివాహాన్ని వెంటనే నిలిపివేశారు.
{{/usCountry}}జూహీ పడుతున్న ఆవేదనను చూసి అత్తగారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందికి వివాహ ఆహ్వాన పత్రికలు వెళ్లినప్పటికీ, జూహీ మానసిక ప్రశాంతత కోసం గ్రాండ్గా జరగాల్సిన ఆ వివాహాన్ని వెంటనే నిలిపివేశారు.
{{/usCountry}}"అంత గ్రాండ్ పెళ్లి వద్దని, ప్రస్తుతానికి వేడుకలను నిలిపివేస్తున్నామని అత్తగారు కుటుంబ సభ్యులందరినీ ఒప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్విటేషన్స్ వెళ్లాక, కోడలి ఆవేదనను అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసే అత్తగారు ఎక్కడైనా ఉంటారా?" అని జూహీ తన అత్తగారి ఉదారతను కొనియాడారు.
1995లో కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయులైన 80 నుంచి 100 మంది సమక్షంలో ఇంటి వద్దే అతి సాధారణంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు జాహ్నవి, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక జే మెహతా నేతృత్వం వహిస్తున్న మెహతా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విలువ దాదాపు రూ. 17,500 కోట్లు (2.1 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం.
గులాబీలతో నిండిన లారీ.. ప్రేమకథలోని తియ్యని జ్ఞాపకాలు
వ్యాపారవేత్తగానే కాకుండా జే మెహతా మంచి రొమాంటిక్ ప్రేమికుడని జూహీ చెప్పారు. 'జలక్ దిఖ్లా జా' షోలో పాల్గొన్నప్పుడు తమ ప్రేమాయణం నాటి మధుర జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు. పెళ్లికి ముందు జే రోజూ ప్రేమ లేఖలు రాసేవారని, కానీ పెళ్లయ్యాక ఆ లేఖలు కాస్తా ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలుగా మారిపోయాయని నవ్వుతూ చెప్పారు.
"ఒకసారి నా పుట్టినరోజున ఏకంగా ఎర్రటి గులాబీలతో నిండిన ఒక లారీనే నాకోసం పంపారు. ఆయన ప్రేమను అంగీకరించి ఓకే చెప్పడానికి నాకు సరిగ్గా ఏడాది సమయం పట్టింది" అని జూహీ చావ్లా తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.