Heorine: 2 వేల మందికి ఆహ్వానం, పెళ్లి రద్దు చేసిన అత్తగారు, గులాబీల లారీ పంపిన భర్త- గ్లామరస్ హీరోయిన్ పెళ్లి సీక్రెట్స్

Juhi Chawla Reveals Marriage Secrets: సీనియర్ హీరోయిన్, గ్లామరస్ బ్యూటీ జూహీ చావ్లా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం, 2000 మందికి వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపడం, ఆ తర్వాత పెళ్లిని అత్తగారు రద్దు చేయడం వంటి వివరాలను జూహీ వెల్లడించారు.

Published on: Oct 5, 2026, 18:20:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Juhi Chawla Reveals Marriage Secrets: 90స్ కాలం నాటి గ్లామరస్ క్వీన్, టాలీవుడ్‌లో నాగార్జున సరసన 'విక్కీదాదా' వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా. వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సీనియర్ కథానాయిక, తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడూ మీడియా కంట పడకుండా గోప్యంగా ఉంచుకోవడానికే మొగ్గుచూపారు.

2 వేల మందికి ఆహ్వానం, పెళ్లి రద్దు చేసిన అత్తగారు, గులాబీల లారీ పంపిన భర్త- గ్లామరస్ హీరోయిన్ పెళ్లి సీక్రెట్స్
2 వేల మందికి ఆహ్వానం, పెళ్లి రద్దు చేసిన అత్తగారు, గులాబీల లారీ పంపిన భర్త- గ్లామరస్ హీరోయిన్ పెళ్లి సీక్రెట్స్

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, మెహతా గ్రూప్ ఛైర్మన్ జే మెహతాను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె తన కుటుంబ విషయాలను అంతగా బయటకు రానివ్వలేదు. ఇటీవల గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో జూహీ పాల్గొని, తన పెళ్లి నాటి సంఘటనలు, ఆ సమయంలో ఎదురైన భావోద్వేగాల గురించి మనసు విప్పి మాట్లాడారు.

2000 మందికి ఆహ్వానాలు.. ఉన్నపళంగా ఆగిపోయిన గ్రాండ్ వెడ్డింగ్

దర్శకుడు రాకేష్ రోషన్ ద్వారా జే మెహతా, జూహీ చావ్లా మొదటిసారి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. సుమారు 2000 మంది ప్రముఖులతో అత్యంత వైభవంగా వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

వారందరికి ఆహ్వాన పత్రికలు కూడా వెళ్లాయి. అయితే ఆ సమయంలోనే జూహీ తల్లి హఠాన్మరణం చెందారు. ఆ తీవ్రమైన విషాదం నుంచి కోలుకోకముందే వివాహ తేదీ దగ్గరపడటంతో జూహీ మానసిక ఆందోళనకు గురయ్యారు.

"నాకు అత్యంత ప్రియమైన అమ్మ దూరమైంది. దానికితోడు అప్పుడే నా కెరీర్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో నటిస్తున్నాను. పెళ్లి చేసుకుంటే నా సినీ కెరీర్ ముగిసిపోతుందేమోనన్న భయం నన్ను తీవ్రంగా వేధించింది. ఈ సంతోషకరమైన ఘట్టాన్ని ఎలా ఆస్వాదించాలో అర్థం కాక ఒకరోజు అత్తగారి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాను" అని జూహీ చావ్లా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

అత్తగారి ఉదారత.. కోడలి మనసుకు పెద్దపీట

జూహీ పడుతున్న ఆవేదనను చూసి అత్తగారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందికి వివాహ ఆహ్వాన పత్రికలు వెళ్లినప్పటికీ, జూహీ మానసిక ప్రశాంతత కోసం గ్రాండ్‌గా జరగాల్సిన ఆ వివాహాన్ని వెంటనే నిలిపివేశారు.

"అంత గ్రాండ్ పెళ్లి వద్దని, ప్రస్తుతానికి వేడుకలను నిలిపివేస్తున్నామని అత్తగారు కుటుంబ సభ్యులందరినీ ఒప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్విటేషన్స్ వెళ్లాక, కోడలి ఆవేదనను అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసే అత్తగారు ఎక్కడైనా ఉంటారా?" అని జూహీ తన అత్తగారి ఉదారతను కొనియాడారు.

1995లో కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయులైన 80 నుంచి 100 మంది సమక్షంలో ఇంటి వద్దే అతి సాధారణంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు జాహ్నవి, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక జే మెహతా నేతృత్వం వహిస్తున్న మెహతా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విలువ దాదాపు రూ. 17,500 కోట్లు (2.1 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం.

గులాబీలతో నిండిన లారీ.. ప్రేమకథలోని తియ్యని జ్ఞాపకాలు

వ్యాపారవేత్తగానే కాకుండా జే మెహతా మంచి రొమాంటిక్ ప్రేమికుడని జూహీ చెప్పారు. 'జలక్ దిఖ్లా జా' షోలో పాల్గొన్నప్పుడు తమ ప్రేమాయణం నాటి మధుర జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు. పెళ్లికి ముందు జే రోజూ ప్రేమ లేఖలు రాసేవారని, కానీ పెళ్లయ్యాక ఆ లేఖలు కాస్తా ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలుగా మారిపోయాయని నవ్వుతూ చెప్పారు.

"ఒకసారి నా పుట్టినరోజున ఏకంగా ఎర్రటి గులాబీలతో నిండిన ఒక లారీనే నాకోసం పంపారు. ఆయన ప్రేమను అంగీకరించి ఓకే చెప్పడానికి నాకు సరిగ్గా ఏడాది సమయం పట్టింది" అని జూహీ చావ్లా తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More