క్రికెటర్ సూర్యకుమార్ ఊరికే మెసేజ్ చేస్తుంటాడన్న నటి.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇన్‌ఫ్లుయెన్సర్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఊరికే మెసేజ్ చేస్తుంటాడని నటి ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్స్ పై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ పరువు నష్టం దావా వేశాడు. ఇది తన పరువుకు భంగం వాటిల్లేలా చేసిందని చెబుతూ కోర్టుకెక్కాడు.

Published on: Jan 16, 2026, 16:33:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ.. జనవరి 13న ఆమెపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.

క్రికెటర్ సూర్యకుమార్ ఊరికే మెసేజ్ చేస్తుంటాడన్న నటి.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ (Instagram/khushi_mukherjee/surya_14kumar)
క్రికెటర్ సూర్యకుమార్ ఊరికే మెసేజ్ చేస్తుంటాడన్న నటి.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ (Instagram/khushi_mukherjee/surya_14kumar)

అసలేం జరిగింది?

ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. "చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు గతంలో చాలా మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. నాకు ఎవరితోనూ లింక్ అప్స్ వద్దు" అని కామెంట్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూర్యకుమార్ అభిమానులు మండిపడ్డారు. జాతీయ స్థాయి క్రీడాకారుడిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.

రూ. 100 కోట్ల దావా.. ఏడేళ్ల జైలు శిక్ష కావాలి

ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఫైజాన్ అన్సారీ.. ముంబై నుంచి యూపీలోని ఘాజీపూర్‌కు వెళ్లి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖుషీ ముఖర్జీ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి అబద్ధాలు చెబుతోందని, దీనివల్ల దేశం గర్వించదగ్గ క్రీడాకారుడి పరువు పోతోందని ఆయన ఆరోపించారు.

ఆమెపై తక్షణం ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఆరోపణలు రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆమె సరైన ఆధారాలు చూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతానని, లేదంటే ఆమెపై చర్యలు తీసుకునే వరకు ఘాజీపూర్‌లోనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నారు.

నా మాటలను వక్రీకరించారు: ఖుషీ

వివాదం ముదరడంతో ఖుషీ ముఖర్జీ వివరణ ఇచ్చింది. తన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని, తాను సూర్యకుమార్‌తో కేవలం స్నేహితురాలిగా మాత్రమే మాట్లాడానని చెప్పింది. "గతంలో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్నేహితుడిగా మాత్రమే మాట్లాడాను. మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. నా సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యింది" అని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

సూర్యకుమార్ మౌనం..

ఈ మొత్తం వ్యవహారంపై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఫైజాన్ అన్సారీ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More