Kirti Kulhari Cyber: సైబర్ మోసంలో చిక్కుకున్న పాపులర్ నటి కీర్తి.. ఎలాంటి ఓటీపీ, పిన్ లేకుండానే భారీగా డబ్బు మాయం!
Kirti Kulhari Get Cyber Fraud: బ్యూటిఫుల్ పాపులర్ నటి కీర్తి కుల్హారీ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె అనుమతి లేకుండానే క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశీ విమానయాన సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ ఘటనపై ముంబై అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Kirti Kulhari Get Lakhs Of Cyber Fraud: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ సరికొత్త రూపాలు దాలుస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ బోల్డ్ నటి కీర్తి కుల్హారీ సైబర్ క్రిమినల్స్ చేతిలో చిక్కి భారీగా నగదు పోగొట్టుకున్నారు.

రూ.2.44 లక్షల దోపిడీ!
కీర్తి కుల్హారీ ప్రమేయం లేకుండానే క్రెడిట్ కార్డ్ వివరాలు చోరీ చేసి రూ.2.44 లక్షల విదేశీ లావాదేవీలు జరిపారు. జూలై 24వ తేదీ రాత్రి వెర్సోవాలోని యారీ రోడ్డులో నివసిస్తున్న 43 ఏళ్ల కీర్తి కుల్హారీ, ముంబై అంధేరి వెస్ట్‌లోని ఒక మల్టీప్లెక్స్‌కు సినిమా చూడటానికి వెళ్లారు.
విదేశీ చెల్లింపు జరిగినట్లు మెసేజ్
థియేటర్‌కు చేరుకునే దారిలోనే ఆమె మొబైల్‌కు బ్యాంకు నుంచి ఓ హెచ్చరిక సందేశం వచ్చింది. ఆమె క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌కు 2,525 యూఎస్ డాలర్ల విదేశీ చెల్లింపు జరిగినట్లు ఆ మెసేజ్‌లో ఉంది.
ఓటీపీ, పిన్ లేకుండానే మాయం!
ఆ మెసేజ్ చూసి దిగ్భ్రాంతికి గురైన కీర్తి కుల్హారి వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఖాతా వివరాలు పరిశీలించగా, అంతర్జాతీయ గేట్‌వే ద్వారా నాలుగు వేర్వేరు లావాదేవీల్లో మొత్తం రూ.2.43 లక్షలకు పైగా నగదు కాజేసినట్లు తేలింది. మరింత నష్టం జరగకుండా బ్యాంకు అధికారులు వెంటనే ఆమె క్రెడిట్ కార్డును బ్లాక్ చేశారు.
డిజిటల్ లీకేజీయే కారణమా?
ఈ ఘటనపై కీర్తి కుల్హారీ అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. తన పిన్ నంబర్ గానీ, క్రెడిట్ కార్డ్ వివరాలు గానీ ఎవరికీ చెప్పలేదని కీర్తి స్పష్టం చేశారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్డ్ డేటాను హ్యాక్ చేసి ఉంటారని సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు.
విదేశీ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం!
ఫోన్ హ్యాకింగ్, ఆన్‌లైన్ డేటా లీక్ లేదా వైఫై నెట్‌వర్క్ ద్వారా సమాచారం చోరీకి గురైందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు ఓటీపీ (OTP) లేదా పిన్ నంబర్ తప్పనిసరి. అయితే విదేశీ వెబ్‌సైట్లు, విమానయాన సంస్థల పోర్టళ్లలో చెల్లింపులు చేసేటప్పుడు కొన్నిసార్లు ఓటీపీ లేకుండానే కార్డు నంబర్, సీవీవీ ఆధారంగా లావాదేవీ పూర్తవుతుంది.
ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డిసేబుల్
సైబర్ నేరగాళ్లు ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని విదేశీ గేట్‌వేల ద్వారా డబ్బులు కాజేస్తుంటారు. క్రెడిట్ కార్డుల్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అవసరం లేనప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా డిసేబుల్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కీర్తి కుల్హారీ కెరీర్ విశేషాలు
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్', 'మిషన్ మంగళ్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!', 'క్రిమినల్ జస్టిస్', 'హ్యూమన్' వంటి సూపర్ హిట్ సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లతో కీర్తి కుల్హారీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె నిర్మాతగా మారి తన తొలి చిత్రాన్ని పూర్తి చేశారు. నటుడు రాజీవ్ సిద్ధార్థతో కీర్తి కుల్హారి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


