Actress: అతనితో దేవుడికి దగ్గరికి వెళ్లడం జాతీయ సమస్యనా, కడుపుమంటతో రగిలిపోండి.. సీనియర్ హీరోతో ఎఫైర్‌పై నటి రాణి

Komal Rani Swarnkar About Govinda Rumours: సీనియర్ హీరో గోవిందాతో లవ్ ఎఫైర్ ఉందంటూ వస్తున్న రూమర్లపై యంగ్ బ్యూటీ రాణి స్వర్ణకార్ తీవ్రంగా స్పందించారు. తానూ గోవిందా కలిసి సినిమా చేస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే కొందరు సెలబ్రిటీలు దీనిపై రచ్చ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటుగా బదులిచ్చారు.

Published on: Oct 3, 2026, 10:49:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Komal Rani Swarnkar About Govinda Rumours: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, యంగ్ బ్యూటీ కోమల్ రాణి స్వర్ణకార్ చుట్టూ గత కొద్దిరోజులుగా అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా గణపతి దర్శనానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ వివాదం ఒక్కసారిగా ముదిరింది.

అతనితో దేవుడికి దగ్గరికి వెళ్లడం జాతీయ సమస్యనా, కడుపుమంటతో రగిలిపోండి.. సీనియర్ హీరోతో ఎఫైర్‌పై నటి రాణి (Instagram)
అతనితో దేవుడికి దగ్గరికి వెళ్లడం జాతీయ సమస్యనా, కడుపుమంటతో రగిలిపోండి.. సీనియర్ హీరోతో ఎఫైర్‌పై నటి రాణి (Instagram)

పాపిట సింధూరం

ఆ సమయంలో రాణి పాపిట సిందూరం కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. తాజాగా బాలీవుడ్ నటి, దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్ పరోక్షంగా రాణిని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ వరుస పరిణామాలపై తాజాగా నటి రాణి స్వర్ణకార్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నోరు విప్పారు. తమ వ్యక్తిగత జీవితంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్న సెలబ్రిటీలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో జరిగే తీవ్రమైన సమస్యలపై నోరు మెదపని వారు, తమ వ్యక్తిగత విషయాలపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని రాణి మండిపడ్డారు.

ఉగ్రవాదం, రాజకీయంపై మాట్లాడరు

"ఉగ్రవాదం, రాజకీయం లేదా ఒక నటుడి మరణం వంటి తీవ్రమైన సామాజిక అంశాలపై ఈ సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎప్పుడూ స్పందించరు. నా క్యారెక్టర్ గురించి, గోవిందా గారితో నాకున్న అనుబంధం గురించి మాట్లాడటానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. మా వ్యక్తిగత జీవితాన్ని రచ్చకెక్కిస్తూ తీర్పులు చెప్పడానికి వీళ్లకు ఎవరు హక్కు ఇచ్చారు?" అని రాణి స్వర్ణకార్ ప్రశ్నించారు.

సినిమా ప్రమోషన్ల కోసం గణేశుడి ఆశీస్సులు తీసుకోవడం తప్పా?

సినిమా ప్రమోషన్లలో భాగంగా దేవుడి దర్శనానికి వెళ్తే దాన్ని అఫైర్‌గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని రాణి నిలదీశారు. తమ రాబోయే సినిమా విజయాన్ని కాంక్షిస్తూ చిత్ర కథానాయకుడితో కలసి లాల్‌బాగ్చా రాజా పాదాల చెంతకు వెళ్లడం జాతీయ సమస్య ఎలా అవుతుందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేరే నటులు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హీరోలతో కలసి రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు రాని అభ్యంతరం, తమ విషయంలోనే ఎందుకు వస్తోందో చెప్పాలని నిలదీశారు.

"మేము కలిసి పనిచేస్తున్న సినిమా ప్రకటన చేశాం తప్ప, మా మధ్య ప్రేమాయణం నడుస్తోందని చెప్పలేదు. వృత్తిపరంగా మేము కలిసి నటిస్తున్నాం, ఇకపై కూడా అలాగే కనిపిస్తాం. ఇది చూసి కడుపుమంటతో రగిలిపోయేవారు అలాగే ఉండనివ్వండి" అని రాణి స్వర్ణకార్ స్పష్టం చేశారు.

కెరీర్ లేనివారే ఇతరుల వివాదాల్లో వేలు పెడతారు!

అవకాశాలు లేక కెరీర్ క్లోజ్ అయిన కొందరు నటీమణులు వార్తల్లో నిలిచేందుకే ఇతరుల విషయాల్లో వేలు పెడుతున్నారని రాణి ఎద్దేవా చేశారు. పవిత్రమైన సిందూరం, భారతీయ సంస్కృతి, వివాహ బంధం గురించి అలాంటి వారు తనకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

దేవుడి పాదాల వద్ద నమస్కరించినప్పుడు స్వామివారి ప్రసాదంగా పసుపు, కుంకుమలు తన నుదుటన పడ్డాయని, దాన్నే కొందరు పెద్ద రచ్చ చేశారని గతంలోనే ఆమె స్పష్టత ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

గోవిందాతో రూమర్లపై రాణి స్వర్ణకార్ పోస్ట్ (Instagram)
గోవిందాతో రూమర్లపై రాణి స్వర్ణకార్ పోస్ట్ (Instagram)
గోవిందాతో రూమర్స్‌పై నటి రాణి స్వర్ణకార్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ (Instagram)
గోవిందాతో రూమర్స్‌పై నటి రాణి స్వర్ణకార్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ (Instagram)

చాలా నవ్వుతెప్పిస్తోంది

సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేసేవారు, స్వయంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇతరులను జడ్జ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని రాణి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇతరుల ఉచిత సలహాలను తానే మాత్రం పట్టించుకోనని, తన పని తాను చేసుకుపోతానని స్పష్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More