మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (లావణ్య కొణిదెల)కి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో సైబర్ వేధింపులపై లావణ్య గళమెత్తారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి

ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఒక నిర్దిష్ట ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కుటుంబాన్ని లాగుతూ అసభ్యకర పోస్టులు
తన ఫిర్యాదులో లావణ్య పలు కీలక విషయాలను ప్రస్తావించారు. సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ సభ్యుల గురించి కూడా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుల వల్ల తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానని, తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆమె పోలీసులకు వివరించారు.
రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు
లావణ్య త్రిపాఠి ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు వెంటనే స్పందించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు.
ఎవరు నిర్వహిస్తున్నారు
ఆ వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు? ఆ పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు మొదలుపెట్టారు. డిజిటల్ ఆధారాల సాయంతో నిందితులను త్వరలోనే గుర్తిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 6న రిలీజ్ కావాల్సింది
ఇక కెరీర్ విషయానికి వస్తే.. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘సతి లీలావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి 6, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సతి లీలావతి మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా
{{/usCountry}}ఇక కెరీర్ విషయానికి వస్తే.. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘సతి లీలావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి 6, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సతి లీలావతి మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా
{{/usCountry}}అలాగే, సతి లీలావతి సినిమాలో దేవ్ మోహన్ హీరోగా చేస్తున్నాడు. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. భార్యా భర్తల మధ్య సాగే కథగా ఈ మూవీ రానుంది.