తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన మలయాళ సినిమా ప్రేమలు. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన మమితా బైజు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మమితా బైజు హీరోయిన్‌గా చేసిన మరో సినిమా డ్యూడ్. తమిళంలో హీరోగా మారిన డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో కథానాయకుడిగా చేశాడు.
అక్టోబర్ 17న డ్యూడ్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన డ్యూడ్ సినిమాను అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మమితా బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు
-ప్రేమలు రిలీజ్ తర్వాత మేకర్స్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత డైరెక్టర్‌తో మీటింగ్ జరిగింది. కీర్తి తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు, కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది.
అలాంటి పాత్ర చేయలేదు
-డ్యూడ్ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కురల్ పాత్రలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు.
-“కురల్” చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
సవాలుగా, ఉత్సహాంగా అనిపించింది
-ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు సవాలుగా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. షూట్ సమయంలో వాటి గురించి ఆందోళన లేకుండా సీన్ మీద ఫోకస్ చేశా. నేను ఎప్పుడూ షూట్‌కు ముందు బాగా ప్రిపేర్ అయి ఉండాలని చూసుకుంటాను. అందుకే ఇది నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించింది.
సహజంగా సంతోషంగా మార్చేస్తారు
-ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయనతో సెట్లో పని చేయడం చాలా ఫన్‌గా, సౌకర్యంగా ఉంటుంది. ఏ సీన్ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు. ఎంత సక్సెస్ వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు.
రియల్ లైఫ్‌లో అంతే
{{/usCountry}}-ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయనతో సెట్లో పని చేయడం చాలా ఫన్‌గా, సౌకర్యంగా ఉంటుంది. ఏ సీన్ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు. ఎంత సక్సెస్ వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు.
రియల్ లైఫ్‌లో అంతే
{{/usCountry}}-ప్రదీప్‌తో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ప్రేక్షకులతో ఆయనకు ఉండే కనెక్షన్ అది స్క్రీన్‌పై మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా అంతే లవబుల్‌గా ఉంటుంది. మా పాత్రలు కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్‌తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.