Manchu Lakshmi About Allu Arjun Raaka: గ్లోబల్ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'పుష్ప' సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
శరవేగంగా రాకా షూటింగ్

హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముంబైలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న రాకా చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. అయితే, తాజాగా రాకా సినిమాపై మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెట్ చూసి నోరు వెళ్లబెట్టా!
తాజాగా రాకా సినిమా సెట్‌ను మంచు లక్ష్మి సందర్శించారు. ముంబైలోని రాకా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి వచ్చిన అనంతరం ఆమె ఒక ప్రత్యేక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. సెట్ విశేషాలను వివరిస్తూ ఆమె వ్యక్తం చేసిన ఆశ్చర్యం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను
"పీపుల్స్ నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా. బన్నీ బాంబేలో షూటింగ్ చేస్తున్నాడు రాకాకి. చాలా రోలుజ నుంచి పిలుస్తున్నాడు సెట్‌కి రమ్మని. కానీ, నాకున్న పనుల వల్ల కుదరలేదు. ఈరోజు చివరకు వెళ్లాను. రాకా సెట్ చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను" అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.
రకాలు.. రకాలు.. రకా..లు..
"రకాలు..రకాలు.. రకా..లు.. వింతలు.. చూశాను నేను. అంతరానుంచి వింత వింతగా ఉన్న జంతువులను తీసుకొచ్చారు. అలాంటి యానిమల్స్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. ఇందులో బన్నీని చూసినట్లు ప్రజలు ఇంకెప్పుడు చూడరు. ఇలాంటి సెట్‌ను కూడా నేను ఇంతవరకు చూడలేదు" అని మంచు లక్ష్మి తెలిపారు.
కానీ చెప్పలేను
"చాలా నిశబ్ధంగా ఉంది. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మాములు పిచ్చెక్కలేదు. వావ్.. వావ్.. వావ్.. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆగలేకపోతున్నాను. మ్యాజిక్.. నేను చాలా షేర్ చేసుకోవాలనుంది. కానీ చెప్పలేను" అని మంచు లక్ష్మి తన వీడియో ముగించారు.
సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ
{{/usCountry}}"చాలా నిశబ్ధంగా ఉంది. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మాములు పిచ్చెక్కలేదు. వావ్.. వావ్.. వావ్.. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆగలేకపోతున్నాను. మ్యాజిక్.. నేను చాలా షేర్ చేసుకోవాలనుంది. కానీ చెప్పలేను" అని మంచు లక్ష్మి తన వీడియో ముగించారు.
సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ
{{/usCountry}}ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో మరోసారి రాకా సినిమా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మైమరిపించడంలో అట్లీది ప్రత్యేక శైలి. రాకా కోసం ఆయన ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ లేదా ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు మంచు లక్ష్మి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, మేకోవర్ కూడా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, మేకోవర్ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉండనున్నాయని విశ్వసనీయ సమాచారం. మంచు లక్ష్మి అందించిన ఈ అప్‌డేట్‌తో బన్నీ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. కాగా, రాకా సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.