...
...
Next Story

Heroine: రెండుసార్లు గర్భస్రావం- 43 ఏళ్లు వచ్చిన తల్లి కాలేకపోయిన తెలుగు హీరోయిన్- చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

Actress Nauheed Cyrusi On Miscarriages: రెండుసార్లు గర్భస్రావం తర్వాత తన జీవిత గమ్యమే మారిపోయిందని ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఇన్‌ఫ్లుయెన్సర్ నౌహీద్ సైరుసీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను కనడంపై సమాజం తెచ్చే ఒత్తిళ్లను పక్కనపెట్టమంటూ చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం నెటిజన్ల ప్రశంసలు దక్కించుకుంటుంది.

Published on: Aug 2, 2026, 17:39:28 IST
Advertisement

Actress Nauheed Cyrusi About Miscarriages: జీవితం అనుకున్నట్లు సాగనప్పుడు మన ఆలోచనలే రూపురేఖలు మార్చుకుంటాయి. సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది ఒకప్పటి తెలుగు హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నౌహీద్ సైరుసీకి.

రెండుసార్లు మిస్‌క్యారేజ్

రెండుసార్లు గర్భస్రావం- 43 ఏళ్లు వచ్చిన తల్లి కాలేకపోయిన తెలుగు హీరోయిన్- చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే?
రెండుసార్లు గర్భస్రావం- 43 ఏళ్లు వచ్చిన తల్లి కాలేకపోయిన తెలుగు హీరోయిన్- చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్న నౌహీద్ సైరుసీ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. రెండుసార్లు గర్భస్రావం (Miscarriages) కావడం తన జీవిత గమ్యాన్నే మార్చేసిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

మొదటిసారి డాక్టర్ చెప్పిన చేదు నిజం..

2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నౌహీద్, 2018లో మొదటిసారి గర్భం దాల్చారు. అయితే మూడో నెల చెకప్ కోసం వెళ్లినప్పుడు డాక్టర్లు చెప్పిన నిజం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. కడుపులోని బిడ్డ గుండెచప్పుడు ఆగిపోయిందని తేలడంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ కష్టసమయంలో తమ బాధను మరచిపోయేందుకు ఎస్పీసీఏ (SPCA) నుంచి చూపు, వినికిడి శక్తి సరిగా లేని 'జోజో' అనే శునకాన్ని దత్తత తీసుకున్నారు.

"కరోనా సమయంలో రెండోసారి గర్భం దాల్చాను. దురదృష్టవశాత్తూ అది కూడా గర్భస్రావంగానే ముగిసింది. అప్పుడే మా జీవిత పరమార్థం ఏమిటో ఆలోచించడం మొదలుపెట్టాం. మనం పెరిగిన నాటి రోజులతో పోలిస్తే ఇప్పటి ప్రపంచం చాలా మారిపోయింది" అని నౌహీద్ తన సోషల్ మీడియా వీడియోలో పేర్కొన్నారు.

ఐవీఎఫ్ వైపు వెళ్లలేదు.. మూగజీవాల సేవే లక్ష్యం!

"సహజంగా మనకు బిడ్డ దక్కాలని రాసి ఉంటే దక్కుతుంది. అంతేకానీ దాని కోసం ఐవీఎఫ్ మార్గాన్ని ఎంచుకోవాలని నేను అనుకోలేదు. మా ప్రేమ, సంరక్షణ అవసరమైన మూగజీవాలను ఆదుకోవడమే మా జీవిత లక్ష్యంగా మార్చుకున్నాం" అని నౌహీద్ సైరుసీ వివరించారు.

సమాజంలో మహిళలపై తీవ్ర ఒత్తిడి!

సమాజంలో పెళ్లయిన మహిళలపై పిల్లలను కనాలని వచ్చే ఒత్తిళ్లపై కూడా నౌహీద్ ఘాటుగా స్పందించారు. పిల్లలను కనడం ఒక్కటే జీవితం కాదని, సమాజానికి లేదా జీవులకు ఉపయోగపడే పనులు ఇంకా చాలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

తనలాగే ఎంతోమంది మహిళలు పిల్లల విషయంలో సమాజం నుంచి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, వారికి తన కథ ధైర్యాన్నిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నౌహీద్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నౌహీద్ బాలీవుడ్ సినిమాలు

కాగా, 2003లో వచ్చిన 'సుపారీ' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన నౌహీద్.. 'అన్వర్', 'భూత్‌నాథ్', 'లైఫ్ మే కభీ కభీ' వంటి సినిమాలతో పాటు 'హిప్ హిప్ హుర్రే' టీవీ షోతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తరుణ్ హీరోయిన్

తెలుగులో తరుణ్ హీరోగా తెరకెక్కిన సఖియా సినిమాలోనూ హీరోయిన్‌గా అట్రాక్ట్ చేశారు నౌహీద్. ఇటీవల పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా నటించిన ఓటీటీ మూవీ 'జబ్ ఖులీ కితాబ్'లోనూ ఆమె కనిపించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe