Nora Fatehi 3 Crore Defamation Case: బాలీవుడ్ నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఒక చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. సదరు ఏవియేషన్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీశారనే ఆరోపణలతో గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టులో నోరాపై రూ. 3 కోట్ల మాననష్ట దావా దాఖలైంది.
ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణం

గత డిసెంబరులో ముంబై నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న సమయంలో డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా సైటేషన్ CJ2 చార్టర్డ్ విమానంలో నోరా ఫతేహి ప్రయాణించారు. ఆ సమయంలో విమానం లోపల వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
లెగో ఏరోప్లేన్, డాల్ ఎరోప్లేన్
ఆ వీడియోల్లో విమానాన్ని "చిన్న బొమ్మ", "లెగో ఏరోప్లేన్", "టాయ్ ప్లేన్" అంటూ నోరా ఫతేహి వర్ణించారు. రూ. 4.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఖాతాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో కంపెనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కంపెనీ వ్యాపారానికి భారీ గండి!
బాధ్యతారాహిత్యంగా చేసిన ఈ కామెంట్స్ వల్ల తమ సంస్థ నమ్మకం, మార్కెట్ విలువ తీవ్రంగా దెబ్బతిన్నాయని డ్యూన్స్ ఏవియేషన్ కోర్టును ఆశ్రయించింది. విమానాల భద్రత, సాంకేతిక విషయాలపై ఎలాంటి పరిజ్ఞానం లేకుండా, నిజానిజాలు సరిచూసుకోకుండా నోరా ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొంది.
15 నుంచి 20 శాతం తగ్గిన బుకింగ్స్
ఈ వీడియోల కారణంగా తమ బుకింగ్స్ 15 నుంచి 20 శాతం వరకు పడిపోయాయని, అనేక మంది ప్రయాణికులు ప్రయాణాలను రద్దు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ విమానం పూర్తి సురక్షితమైనదని డ్యూన్స్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
అన్ని అనుమతులు ఉన్నాయి!
"మా విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పూర్తి గుర్తింపు ఉంది. చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (NSOP) ద్వారా చట్టబద్ధంగానే సేవలు అందిస్తున్నాం" అని కంపెనీ కోర్టుకు తెలిపింది.
పరిహారంతో పాటు పబ్లిక్ క్లారిఫికేషన్!
{{/usCountry}}"మా విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పూర్తి గుర్తింపు ఉంది. చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (NSOP) ద్వారా చట్టబద్ధంగానే సేవలు అందిస్తున్నాం" అని కంపెనీ కోర్టుకు తెలిపింది.
పరిహారంతో పాటు పబ్లిక్ క్లారిఫికేషన్!
{{/usCountry}}కేవలం రూ. 3 కోట్ల నష్టపరిహారం కోరడమే కాకుండా, సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను వెంటనే తొలగించాలని కంపెనీ డిమాండ్ చేసింది. దీనిపై నోరా ఫతేహి బహిరంగంగా వివరణ ఇవ్వాలని కూడా కోరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పిటిషన్ దాఖలు కాగా, గాంధీనగర్‌లోని సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ ధర్మాసనం సెప్టెంబర్ 25న ఈ వ్యవహారంపై విచారణ జరపనుంది.
తెలుగులో ఐటమ్ భామగా నోరా ఫతేహి
ఇదిలా ఉంటే, నోరా ఫతేహి తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కిక్ 2 (టైటిల్ సాంగ్), టెంపర్ (ఇట్టాగే రెచ్చిపోదాం సాంగ్), బాహుబలి (మనోహరి సాంగ్) సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో నోరా ఫతేహి రాణించారు.
నోరా ఫతేహి సర్కే చునార్ సాంగ్ వివాదం
ఉఫ్ యే సియాప్పా, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, రోర్ వంటి సినిమాల్లోనూ నోరా ఆకట్టుకున్నారు. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కేడీ ది డెవిల్‌లో నోరా ఫతేహి నర్తించిన సర్కే చునార్ సాంగ్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.