హీరోయిన్లందరూ వేశ్యలు.. నువ్వు నటివైతే నా మణికట్టు కోసుకుంటా అని మా అమ్మ బెదిరించింది: బోల్డ్ నటి షాకింగ్ కామెంట్స్
నటి సయానీ గుప్తా తనకు నటనపై ఉన్న ఆసక్తి గురించి, దాని కోసం తన తల్లితో పడ్డ గొడవల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. మంచి ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్తే తన తల్లి ఏకంగా చేయి కోసుకుంటానని బెదిరించిందని, నటీమణులను ఆమె చిన్నచూపు చూసేవారని సయానీ చెప్పుకొచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ లో నటించిన సయానీ గుప్తా తెలుసు కదా. అందులో ఆమె చాలా బోల్డ్ సీన్స్ లో నటించింది. నిజానికి చిన్నప్పటి నుంచే నటి కావాలనే కోరిక సయానీ గుప్తాకు చాలా బలంగా ఉండేదట. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆమె చిన్న వయసులోనే తనకు మంచి జీతం ఇస్తున్న కార్పొరేట్ జాబ్ వదులుకోవాల్సి వచ్చింది.

కానీ ఈ నిర్ణయం ఆమె తల్లికి ఏమాత్రం నచ్చలేదట. ఇటీవల 'సైరస్ సేస్' అనే కార్యక్రమంలో పాల్గొన్న సయానీ.. నటనలో శిక్షణ కోసం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (FTII)లో చేరినప్పుడు.. తన తల్లి ఏకంగా నెల రోజుల పాటు తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకుంది.
ఆ రోజు ఏం జరిగిందంటే?
ఆ ఇంటర్వ్యూలో సయానీ గుప్తా నటిగా తన తొలినాళ్ల గురించి మాట్లాడింది. "నేను ఎఫ్‌టీఐఐలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు మా అమ్మ చాలా సీరియస్ అయ్యారు. 'నువ్వు అక్కడికి వెళ్తే నేను నా మణికట్టు కోసుకుంటాను' అని బెదిరించారు. ఆమె నా నిర్ణయాన్ని అసలు నమ్మలేకపోయారు. ఆ సమయంలో నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు విపరీతమైన విసుగు వచ్చేది. నేను పని పట్ల అంకితభావంతో ఉండేదాన్ని కాబట్టి అక్కడ చాలా డబ్బులు సంపాదించాను. కానీ నా జీవితం ఇలా ఉండాలని నేను కోరుకోలేదు" అని వివరించింది.
హీరోయిన్లు అంటే చులకన..
తన చిన్నతనం గురించి సయానీ వివరిస్తూ.. "నేను పెరిగేటప్పుడు కూడా మా అమ్మ నన్ను స్టేజ్ షోలలో నటించడానికి రిహార్సల్స్‌కు వెళ్లనిచ్చే వారు కాదు. నన్ను గదిలో పెట్టి తాళం వేసేవారు. హీరోయిన్లు అంటే వేశ్యలు అనే అభిప్రాయం ఆమెకు ఉండేది. నటన వృత్తిపై ఆమెకు అంత చులకన భావం ఉండేది" అని చెప్పింది. ఎఫ్‌టీఐఐలో సీటు వచ్చిన విషయాన్ని తల్లికి చెప్పకుండా దాచడానికి చాలా ప్రయత్నించానని, కానీ తాను క్యాంపస్‌కు చేరుకున్న రెండు నిమిషాల్లోనే ఆమెకు ఆ విషయం తెలిసిపోయిందని సయానీ తెలిపింది.
చివరకు అమ్మే నటిగా మారి..
అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సయానీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు, అక్కడ విద్యార్థులు తీస్తున్న డిప్లొమా సినిమాల్లో నటించే అవకాశం ఆమె తల్లికి వచ్చింది. వచ్చిన ఐదు అవకాశాల్లో ఆమె మూడింటిని అంగీకరించింది. ఆ తర్వాత సయానీతో మాట్లాడుతూ.. "నువ్వు రాబోయే రెండేళ్లు ఇదే పని చేయాల్సి వస్తే చేసెయ్.. ఇది అంత చెడ్డదేమీ కాకపోవచ్చు" అని అన్నారట.
సయానీ కెరీర్ ఇలా..
సయానీ గుప్తా 2012లో 'సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్' అనే సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2015లో వచ్చిన 'మార్జరిటా విత్ ఎ స్ట్రా' సినిమాలో ఆమె పోషించిన సహాయ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఫ్యాన్', 'జాలీ ఎల్‌ఎల్‌బి 2', 'ఆర్టికల్ 15' వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' నాలుగో సీజన్‌లో కనిపించింది. ఈ సిరీస్ డిసెంబర్ 19, 2025న ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


