Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam - House No: 47). ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే కొంత ఆలస్యంగా వస్తున్నప్పటికీ, ఈ సినిమా విడుదల పై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా సరికొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

గతంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోందని నిర్మాతలు స్పష్టం చేశారు.
జోరందుకున్న ప్రమోషన్లు.. 'మాలా' సాంగ్‌కి ఊహించని రెస్పాన్స్
ఆదర్శ కుటుంబం మూవీ విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) ప్రమోషన్ల విషయంలో వేగం పెంచింది. అందులో భాగంగానే ఇటీవలే విడుదల చేసిన 'మాలా' (Maala) సెకండ్ సింగిల్ పాటకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది.
సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన ఈ మాస్ సెలబ్రేషన్ సాంగ్‌లో వెంకటేష్ తన మార్క్ ఎనర్జీతో అలరించగా, నివేథా పేతురాజ్ తన గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
ఓపెనింగ్స్ సాధించాలంటే ప్రమోషన్ డోస్ పెంచాల్సిందే
ప్రస్తుతం ఈ సినిమాపై మార్కెట్లో మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 30న బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించాలంటే ప్రొడక్షన్ హౌస్, మూవీ టీమ్ ప్రమోషన్ల విషయంలో మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}ప్రస్తుతం ఈ సినిమాపై మార్కెట్లో మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 30న బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించాలంటే ప్రొడక్షన్ హౌస్, మూవీ టీమ్ ప్రమోషన్ల విషయంలో మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}రాబోయే రోజుల్లో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ సినిమా రేంజ్‌ను, అంచనాలు ఎలా ఉండబోతున్నాయో తేల్చనుంది. ఇప్పటికే రెండు పాటలు అలరించగా, మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతున్నాయో రానున్న రోజుల్లో తేలనుంది.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో క్రేజ్‌తో పాటు నారా రోహిత్, శ్రీనిధి శెట్టి, నివేథా పేతురాజ్‌ల కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది.
తమ బ్యానర్లో మళ్లీ ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్ కొట్టాలని నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరి రాబోయే పది రోజుల్లో వినూత్న ప్రమోషన్లతో 'ఆదర్శ కుటుంబం' టీమ్ ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తుందో చూడాలి.