Adarsha Kutumbam Release Date: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఇదే- స్పెషల్ డే-దసరాకు ముందే- పోస్టర్ తో ట్విస్ట్
Adarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. స్పెషల్ డే రోజు ఈ చిత్రం థియేటర్లకు రాబోతుంది. దసరాకు ముందే సందడి చేయనుంది.
Adarsha Kutumbam Release Date: వరుస సినిమాలతో జోరు మీదున్న సీనియర్ హీరో వెంకటేష్ కొత్త మూవీ థియేటర్లకు రాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ (జూన్ 27) ప్రకటించారు. ఓ స్పెషల్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్
వెంకటేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ వచ్చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అంటే దసరాకు ముందుగానే వెంకీ మామ మూవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రానుంది.
‘‘ప్రతి ఫ్యామిలీ గుర్తుంచుకోవాల్సిన డేట్. ఆదర్శ కుటుంబం డోర్లు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న తెరుచుకుంటాయి’’ అని వెంకటేష్ తన సోషల్ మీడియాలో పోస్టర్ పంచుకున్నారు.
పండక్కి ముందే సందడి
తనదైన యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే హీరో వెంకటేస్ ఈ సారి దసరాకు ముందే థియేటర్లలో పండగ తేనున్నారు. 2026లో దసరా అక్టోబర్ 20న కాగా.. వెంకీ మామ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఆ రోజు ఫ్రైడే. అలా వీకెండ్ కలిసొస్తుంది. ఒకవేళ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కట్టే అవకాశం ఉంది.
పోస్టర్ తో ట్విస్ట్
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోస్టర్ లో ఓ ట్విస్ట్ కనిపిస్తోంది. ఇందులో వెంకీ ఫ్యామిలీ రెండు ఫొటోలున్నాయి. ఒకదాంట్లో ఏమో భార్య, కూతురు, కొడుకు పద్ధతిగా ఉన్నారు. ఇంకోదాంట్లో ఏమో మోడర్న్ లుక్ లో కనిపించారు. దీన్ని బట్టి సినిమా ఈ ఫ్యామిలీకి రెండు షేడ్స్ ఉంటాయని అర్థమవుతోంది.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నివేదా పేతురాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ మూవీని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం టైటిల్ తో పాటు హౌస్ నంబర్ 47 అనే ట్యాగ్ లైన్ ఈ మూవీపై క్యూరియాసిటీ బిల్డ్ చేస్తోంది. మరి 2026 సంక్రాంతికి చిరంజీవితో కలిసి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో అదరగొట్టిన వెంకీ.. దసరా ముందు ఎలాంటి కిక్ ఇస్తారో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


