Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి యంగ్ హీరో? గ్రాండ్ లాంచ్ వేళ క్రేజీ న్యూస్.. ఎవరంటే?
Bigg Boss 10: బుల్లితెరపై క్రేజీగా సాగిపోయే బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ కు టైమ్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మైల్‌స్టోన్ సీజన్‌లో ఓ యంగ్ హీరో అడుగుపెడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ మూవీలో మెరిసిన ఆ హీరో ఎవరో ఇక్కడ చూసేయండి.
Bigg Boss 10: తెలుగు బుల్లితెర వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10 సీజన్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మైల్‌స్టోన్ 10వ సీజన్ వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. సెప్టెంబర్ 6న ఈ షో గ్రాండ్ లాంచ్ కానుందని సమాచారం.

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లు
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ టైమ్ దగ్గరపడుతుండటంతో కంటెస్టెంట్ల లిస్ట్ తెగ వైరల్ గా మారుతోంది. సెలబ్రిటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారనే దానిపై రూమర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కావడంతో ఈ సారి కాన్సెప్ట్, టాస్కులు, గ్లామర్ డోస్ పరంగా షో నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని తెలిసింది.
యంగ్ హీరో అదిత్ అరుణ్
ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల జాబితాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ రేసులో ఒక టాలెంట్ ఉన్న యంగ్ హీరో పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంతో అలరించిన నటుడు అదిత్ అరుణ్ బిగ్‌బాస్ 10వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
'కథలో రాజకుమారి', 'తుంగభద్ర', 'పిఎస్‌వి గరుడ వేగ', 'డియర్ మేఘ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అదిత్ అరుణ్ పరిచయమే. అరుణ్ ఎంట్రీ ఇస్తే షోకి కొత్త ఎనర్జీ తోడవుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న అదిత్ అరుణ్ ఎంట్రీ వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మళ్లీ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున
ఈ సారి కూడా కింగ్ అక్కినేని నాగార్జుననే ఈ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా (హోస్ట్) వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ షోతో తనకున్న సుదీర్ఘమైన, విజయవంతమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ నాగార్జున మళ్లీ తనదైన శైలి హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి నాగ్ చేసిన కామెంట్లు వైరల్ గా మా
అయితే, అదిత్ అరుణ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడంపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ వార్త తెలుగు బుల్లితెర వీక్షకుల్లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది. త్వరలోనే కంటెస్టెంట్లకు సంబంధించిన తుది జాబితాపై స్పష్టత రానుంది. జబర్దస్త్ కమెడియన్లు ఆటో రాంప్రసాద్, నరేష్ కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్లో పార్టిసిపేట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


