OTT Releases: ఈ వారం ఓటీటీలోని ఇంట్రెస్టింగ్ మూవీస్.. బ్లాక్ బస్టర్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వెల్‌కమ్ టు ది జంగిల్ వరకు!

OTT Releases: ఆగస్టు 17 నుంచి 23 వరకు ఓటీటీ వేదికలపై సరికొత్త సినిమాల సందడి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన టాప్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం. వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Aug 17, 2026, 12:33:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Releases: డిజిటల్ స్క్రీన్లపై వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఆగస్టు మూడో వారంలో అదిరిపోయే ఆప్షన్లు వచ్చేస్తున్నాయి. పాపులర్ ఓటీటీ సంస్థలు తమ కేటగిరీలను విస్తరిస్తూ రొమాన్స్, కామెడీ, యాక్షన్, సూపర్ హీరో డ్రామాలతో కూడిన సరికొత్త కంటెంట్‌ను వీక్షకుల ముందుకు తెస్తున్నాయి. మీ మొబైల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలను హోమ్ థియేటర్లుగా మార్చేందుకు సిద్ధమైన ఈ వారం క్రేజీ రిలీజ్ లైనప్ విశేషాలు ఇక్కడ చూద్దాం.

ఈ వారం ఓటీటీలోని ఇంట్రెస్టింగ్ మూవీస్.. బ్లాక్ బస్టర్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వెల్‌కమ్ టు ది జంగిల్ వరకు!
ఈ వారం ఓటీటీలోని ఇంట్రెస్టింగ్ మూవీస్.. బ్లాక్ బస్టర్ చెన్నై లవ్ స్టోరీ నుంచి వెల్‌కమ్ టు ది జంగిల్ వరకు!

లాంతర్న్స్ (Lanterns)

సూపర్ హీరో కథల లవర్స్ కోసం వస్తున్న లైవ్-యాక్షన్ సిరీస్ 'లాంతర్న్స్'. సీనియర్ గ్రీన్ లాంతర్న్ హాల్ జోర్డాన్, కొత్త రిక్రూట్ జాన్ స్టెవర్ట్ ఇద్దరూ కలిసి అమెరికాకు గుండెకాయ లాంటి ఒక ప్రాంతంలో జరిగిన ఒక రహస్య హత్య కేసును విచారించే నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ ఆగస్టు 17 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ'. మొదటి ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితం అయిపోలేదని, ఆ మొదటి ప్రేమ ముగింపులోనే అసలైన, అంతకంటే మెరుగైన ప్రేమకు నాంది పడుతుందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ప్రేమ, గుండె కోత, జీవితంలో కొత్త బంధాన్ని కనుగొనడం వంటి హృదయపూర్వక భావోద్వేగాలతో సాగే ఈ రోమ్-కామ్ డ్రామా ఆగస్టు 21 నుంచి సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. దీనికి యు/ఎ 13+ సర్టిఫికేట్ లభించింది.

ప్యార్ ప్రేమ కళ్యాణం (Pyaar Prema Kalyanam)

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ఒక యువతి పెళ్లి తర్వాత కూడా తన పుట్టింట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను పెళ్లాడిన కొత్త భర్త తప్పనిసరి పరిస్థితుల్లో అత్తగారింట్లోనే ఇల్లరికం అల్లుడిగా అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగిన హాస్యాస్పద పరిణామాలు, ప్రేమ కథతో ఈ ప్యార్ ప్రేమ కళ్యాణం చిత్రం రూపుదిద్దుకుంది.

ఎలన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించడంతో పాటు సాన్వి మేఘనతో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామా ఆగస్టు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

వెల్‌కమ్ టు ది జంగిల్ (Welcome to the Jungle)

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'వెల్‌కమ్ టు ది జంగిల్'. సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వార్సి, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని వంటి భారీ తారగణం ఇందులో నటించారు.

ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్నుగప్పి తన వద్ద ఉన్న నల్లధనాన్ని దాచాలనుకునే ఒక భారీ ధనవంతుడైన బిజినెస్‌మెన్, ఆ డబ్బుతో ఒక దారుణమైన పెద్ద సినిమాను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత జరిగే గందరగోళం, నవ్వుల ప్రయాణమే ఈ సినిమా కథ. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (Outer Banks Season 5)

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన 'ఔటర్ బ్యాంక్స్' సిరీస్ చివరిదైన ఐదో సీజన్‌తో ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 10 ఎపిసోడ్‌లతో కూడిన ఈ ఫైనల్ సీజన్ అన్ని ఎపిసోడ్‌లు ఒకేసారి వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

ఒక దారుణమైన నష్టాన్ని చవిచూసిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన పోగ్స్ గుంపు, తమ పాత శత్రువులను ఎదుర్కొంటూ, పురాణ కాలం నాటి బ్లూ క్రౌన్ కోసం వేట సాగిస్తుంది. మధ్యలో ప్రతీకారం, విముక్తి కోసం పోరాడే కథాంశంతో ఇది సాగుతుంది. ఈ మిస్టరీ అడ్వెంచర్ సిరీస్ ఆగస్టు 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

యావరేజ్ జో సీజన్ 2 (Average Joe Season 2)

మొదటి సీజన్ ఊహించని మలుపులతో ముగిసిన తర్వాత, దానికి కొనసాగింపుగా రెండో సీజన్ వస్తోంది. రష్యన్ మాఫియాతో ముడిపడిన ఒక కొత్త ముప్పు కారణంగా జో వాషింగ్టన్ కుటుంబం మళ్లీ ప్రమాదంలో పడుతుంది.

సాధారణ ప్లంబర్ నుంచి అయిష్టంగానే ఫైటర్‌గా మారిన జో వాషింగ్టన్ (డియోన్ కోల్) తన బృందం (లియాన్, కాథీ, టచ్) తో కలిసి పిట్స్‌బర్గ్‌ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఆగస్టు 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More