Adivi Sesh: డెకాయిట్ క్లైమ్యాక్స్ 45 డిగ్రీల వేడిలో ఓ పర్వతంపై చేశాం.. థ్రిల్లర్లకు ఈ సినిమాతో బ్రేక్: అడివి శేష్

Adivi Sesh: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డెకాయిట్' ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమాతో తన ఇమేజ్‌ను మార్చుకోబోతున్నట్లు శేష్ ధీమా వ్యక్తం చేశాడు.

Published on: Apr 1, 2026, 18:44:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, మేజర్, హిట్-2 వంటి వరుస థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు తన రూట్ మార్చాడు. త్వరలో 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

Adivi Sesh: డెకాయిట్ క్లైమ్యాక్స్ 45 డిగ్రీల వేడిలో ఓ పర్వతంపై చేశాం.. థ్రిల్లర్లకు ఈ సినిమాతో బ్రేక్: అడివి శేష్
Adivi Sesh: డెకాయిట్ క్లైమ్యాక్స్ 45 డిగ్రీల వేడిలో ఓ పర్వతంపై చేశాం.. థ్రిల్లర్లకు ఈ సినిమాతో బ్రేక్: అడివి శేష్

ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

థ్రిల్లర్ ముద్ర నుంచి బయటకు..

ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. అడివి శేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. #AskSesh హ్యాష్‌ట్యాగ్‌తో జరిగిన ఈ చిట్‌చాట్‌లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు అతడు సమాధానాలిచ్చాడు.

"మీరు ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలే చేస్తారు కదా.. ఆ జోనర్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు?" అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.. "డెకాయిట్ సినిమాయే ఆ మార్పునకు నాంది" అని శేష్ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని అతడు హింట్ ఇచ్చాడు.

45 డిగ్రీల వేడిలో..

ఇక ఈ డెకాయిట్ సినిమాలో అత్యంత క్లిష్టమైన సీన్ ఏది అని మీరు భావిస్తున్నారు అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. క్లైమ్యాక్స్ అని అన్నాడు. దీని షూటింగ్ 45 డిగ్రీల వేడిలో ఓ పెద్ద పర్వతంపై చేసినట్లు అతడు వెల్లడించాడు.

'డెకాయిట్' అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు..

మరో అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఈ సినిమా కథా వస్తువు గురించి శేష్ వివరించాడు. "డెకాయిట్ అనేది ఒక అందమైన ప్రేమకథ.. అయితే ఆ ప్రేమకథ చుట్టూ యాక్షన్ ఆవరించి ఉంటుంది. ఇది కేవలం మెదడుతో ఆలోచించి చూసే సినిమా కాదు, మనసుతో ఫీలయ్యే సినిమా. ఈ చిత్రంలో ప్రేమ అనే భావోద్వేగమే ప్రధానాంశం" అని అతడు చెప్పుకొచ్చాడు. కేవలం ఇన్వెస్టిగేషన్ లేదా మిస్టరీ కాకుండా, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్టును అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేష్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలకంటే 'డెకాయిట్' భిన్నంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మృణాల్ ఠాకూర్, అడివి శేష్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More