Adivi Sesh: డెకాయిట్ మూవీతో కెరీర్లో మరో సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్. తాజాగా వచ్చిన ఈ లవ్ స్టోరీ కమ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో అడివి శేష్ ఎమోషనల్ గా మాట్లాడాడు.
ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలని..

డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. “డెకాయిట్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ. నేనెప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండే వాడిని. ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. ఆ బాధ్యతలేంటో నాకు తెలుసు. ఇండస్ట్రీలోనూ నేను పెద్ద కొడుకునే అనుకుంటాను. నేను సెట్స్ లో లైట్లు మోశాను.. కెమెరా మోశాను.. ట్రైపాడ్ మోశాను.. జనరేటర్లు మోశాను.. నేను చేయని పని లేదు. ఆడియెన్సే నా ఫ్యామిలీ.. ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. నాకు వేరే దారి లేదు. మరో పని రాదు. ప్రాణం పెట్టాను..” అని శేష్ ఎమోషనల్ అయ్యాడు.
నిర్మాత సుప్రియ గురించి..
డెకాయిట్ మూవీ నిర్మాత సుప్రియ గురించి కూడా శేష్ గొప్పగా మాట్లాడాడు. తాను పని చేసిన నిర్మాతల్లో బెస్ట్ ఆమెనే అని, ఇది ఎంతో మంది ప్రముఖ నిర్మాతల ముందుకు తాను చెబుతున్నానని అంటూ శేష్ భావోద్వేగానికి గురయ్యాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను..
ఇక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు. “నేను గతంలో కిస్ అనే ఓ మూవీ చేశాను. అనివార్య కారణాల వల్ల ఆ సినిమాపై ఓ కేసు వేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. చుట్టూ పోలీసులు.. నన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఒకటే అనుకున్నాను.. ఇక నుంచి ఏ సినిమా చేసినా ఎవరో చెప్పింది విని చేయకూడదు.. మనసుకు నచ్చితేనే చేయాలి అని డిసైడయ్యాను” అని అడివి శేష్ చెప్పాడు.
డెకాయిట్ మూవీ బాక్సాఫీస్
డెకాయిట్ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
{{/usCountry}}డెకాయిట్ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
{{/usCountry}}ఇండియాలోనే నెట్ వసూళ్లు రూ.13 కోట్లు దాటాయి. ఆదివారం ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వరుసగా థ్రిల్లర్ జానర్ లో మూవీస్ చేస్తూ వస్తున్న అడివి శేష్.. ఈ డెకాయిట్ తో దానికి బ్రేక్ ఇచ్చాడు. లవ్ కమ్ యాక్షన్ తో వచ్చి సక్సెస్ సాధించాడు.