Dacoit Song: ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్యా? డ్యాన్స్‌తో కుమ్మేసిన అడివి శేష్‌.. వైర‌ల్‌గా చిచ్చుబుడ్డి సాంగ్‌.. ఆ గ్రేస్

Dacoit Song: హీరో అడివి శేష్ అంటే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టే నటుడే గుర్తుకొస్తాడు. ఎమోషన్ తోనూ ఏడిపిస్తాడు. కానీ అడివి శేష్ డ్యాన్స్ తో ఇరగదీశాడంటే నమ్మగలరా? కానీ అదే జరిగింది. డెకాయిట్ లోని చిచ్చుబుడ్డి పాటకు శేష్ డ్యాన్స్ కుమ్మేశాడు. ఈ వీడియో సాంగ్ వైరల్ గా మారింది.

Published on: Mar 29, 2026, 07:31:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోలంటే యాక్షన్ సీన్లు మాత్రమే కాదు డ్యాన్స్, కామెడీ, ఎమోషన్ అన్నీ పండించాలి. కానీ అడివి శేష్ ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో పెద్దగా డ్యాన్స్ చేసినట్లు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ తోనే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ తనలోని డ్యాన్సర్ ను బయటకు తీశాడు. డెకాయిట్ సినిమా నుంచి రిలీజైన ‘చిచ్చుబుడ్డి’ వీడియో సాంగ్ లో శేష్ డ్యాన్స్ వేరే లెవల్ లో ఉంది.

చిచ్చుబుడ్డి సాంగ్ లో జొనితా, అడివి శేష్ (x/MokshaMovies)
చిచ్చుబుడ్డి సాంగ్ లో జొనితా, అడివి శేష్ (x/MokshaMovies)

అడివి శేష్ డ్యాన్స్

అడివి శేష్ డ్యాన్స్ చేస్తే ఇలా ఉంటుందా? అడివి శేష్ లో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా? ఆ గ్రేస్ ఏంటి బాబు? ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ దాచావయ్యా?.. ఇవీ చిచ్చుబుడ్డి సాంగ్ లో అడివి శేష్ డ్యాన్స్ చూసిన తర్వాత నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు. అవును.. ఈ సాంగ్ లో అడివి శేష్ అంతలా రెచ్చిపోయి డ్యాన్స్ కుమ్మేశాడు.

జొనితా గాంధీతో

డెకాయిట్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. పాపులర్ సింగర్ కమ్ డ్యాన్సర్ జొనితా గాంధీ ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసింది. సినిమాలో తొలిసారి ఆడిపాడింది. అడివి శేష్ తో జొనితా కెమిస్ట్రీ అదిరిపోయింది. వీళ్లు ఇద్దరు కలిసి స్టెప్పులతో అదరగొట్టారు.

వైరల్ గా సాంగ్

శనివారం (మార్చి 28) రాత్రి రిలీజ్ అయిన చిచ్చుబుడ్డి వీడియో సాంగ్ తెగ వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా అడివి శేష్, జొనితా డ్యాన్స్ పై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్’ అని పేర్కొంటున్నారు.

ఎందుకు చేయలేదని

అడివి శేష్ డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘‘డెకాయిట్ నుంచి వచ్చిన చిచ్చుబుడ్డి సాంగ్ బాగుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ అడివి శేష్ డ్యాన్స్.. అది చూశాక ఇంత గ్రేస్ పెట్టుకుని ఎందుకు ట్రై చేయాలేదా అనిపించింది’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

డెకాయిట్ గురించి

అడివి శేష్, మృనాల్ ఠాకూర్‌ జంటగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. దీనికి షనీల్ డియో డైరెక్టర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిచ్చుబుడ్డి పాటను రామ్ మిర్యాలా, జొనితా పాడారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More