...
...
Next Story

బోర్డర్ 2 కచ్చితంగా చూస్తానన్న ఆప్ఘనిస్థాన్ క్రికెటర్.. ఆ మూవీ స్టార్స్ రియాక్షన్ ఇలా

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రషీద్ ఖాన్ ‘బోర్డర్ 2’ సినిమా చూస్తానంటూ మాటిచ్చాడు. రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ అతడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సన్నీ డియోల్, వరుణ్ ధావన్, సునీల్ శెట్టి వంటి బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.

Published on: Jan 22, 2026, 18:04:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, సునీల్ శెట్టి, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ వీడియోపై స్పందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బోర్డర్ 2’ సినిమాను తాను తప్పకుండా చూస్తానని రషీద్ ఖాన్ మాటిచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో క్రికెట్ సిరీస్ కోసం దుబాయ్‌లో ఉన్న రషీద్ ఖాన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

రషీద్ ఖాన్ వీడియోలో ఏముందంటే..

బోర్డర్ 2 కచ్చితంగా చూస్తానన్న ఆప్ఘనిస్థాన్ క్రికెటర్.. ఆ మూవీ స్టార్స్ రియాక్షన్ ఇలా
బోర్డర్ 2 కచ్చితంగా చూస్తానన్న ఆప్ఘనిస్థాన్ క్రికెటర్.. ఆ మూవీ స్టార్స్ రియాక్షన్ ఇలా

ఆ వీడియో క్లిప్‌లో రషీద్ ఖాన్ రోడ్డు పక్కన నిలబడి, బొగ్గుల కుంపటిపై మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ కనిపించాడు. ఈ వీడియోకు అతడు ‘బోర్డర్ 2’ సినిమాలోని ‘ఘర్ కబ్ ఆవోగే’ పాటను బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేశాడు. వీడియోలో అతడు నవ్వుతూ, మాట్లాడుతూ, కన్నుగీటుతూ, థంబ్స్ అప్ చూపిస్తూ సందడి చేశాడు.

ఆ క్లిప్‌ను షేర్ చేస్తూ.. "నేను బోర్డర్ 2 సినిమాను తప్పకుండా చూస్తాను. కానీ నేను దీన్ని పోస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం" అని రాసుకొచ్చాడు. అలాగే ఆ సినిమాలోని ప్రధాన నటులను తన పోస్టులో ట్యాగ్ చేశాడు.

బోర్డర్ 2 నటుల స్పందన..

రషీద్ ఖాన్ పోస్టుపై వరుణ్ ధావన్ స్పందిస్తూ "ఎస్ బ్రదర్" అని బదులిచ్చాడు. అహాన్ శెట్టి స్పందిస్తూ "లాట్స్ ఆఫ్ లవ్ బ్రదర్" అని కామెంట్ చేశాడు. సునీల్ శెట్టి "ఇదీ అసలైన మజా అంటే" అని ఉత్సాహపరిచాడు. సన్నీ డియోల్ ఆ పోస్టును లైక్ చేశాడు.

అంతకుముందు సునీల్ శెట్టి అల్లుడు, క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా తన బావమరిది అహాన్ శెట్టికి మద్దతు తెలిపాడు. రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అందులో "ఒకవేళ అహాన్ శెట్టి ఈ వీడియోపై కామెంట్ చేస్తే, నేను బోర్డర్ 2 సినిమాను రెండు సార్లు చూస్తాను" అని రాశాడు. దానికి క్యాప్షన్‌గా "ఈ మాట అందరికీ చేరాలి" అని రాహుల్ పేర్కొన్నాడు.

‘బోర్డర్ 2’ సినిమా విశేషాలు..

ఇది 1971లో జరిగిన భారత పాకిస్థాన్ యుద్ధంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. గుల్షన్ కుమార్, టీ-సిరీస్ సంస్థలు జేపీ దత్తాకు చెందిన జేపీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా గణతంత్ర దినోత్సవానికి ముందే జనవరి 23న అంటే శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks