OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- దుష్ట శక్తి వర్సెస్ దైవ శక్తి- 4 భాషలు, 7.5 రేటింగ్- ఎక్కడంటే?

Horror Thriller Agadha OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో డివోషనల్ హారర్ థ్రిల్లర్ సినిమా అగధ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 7.5 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన అగధ దుష్ట శక్తి వర్సెస్ దైవ శక్తి అన్నట్లుగా సాగుతుంది. 4 భాషల్లో రిలీజైన అగధ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 25, 2026, 13:05:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Agadha OTT Release Today In 4 Languages: ఎప్పుడైనా సరే హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. రెగ్యులర్ ఫార్మాట్‌లోనే కథ ఉన్నప్పటికీ డిఫరెంట్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మైండ్-బెండింగ్ డివోషనల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అగధ’.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- దుష్ట శక్తి వర్సెస్ దైవ శక్తి- 4 భాషలు, 7.5 రేటింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- దుష్ట శక్తి వర్సెస్ దైవ శక్తి- 4 భాషలు, 7.5 రేటింగ్- ఎక్కడంటే?

ఓటీటీలోకి అగధ

థియేటర్లలో రిలీజై సస్పెన్స్, హారర్ ప్రేమికులను అలరించిన అగధ ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 25) స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో అగధను తెరకెక్కించారు.

'అగధ' అసలు కథేంటి?

ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యంగ్ ఉమెన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో వరుసగా జరిగే వింత మరణాలు, ఆమె చెల్లెలి అనుమానాస్పద ఆత్మహత్య ఈ కథకు ప్రధాన మలుపుగా మారుతాయి. ఈ వరుస దారుణాల వెనుక ఉన్న నిజానిజాలు తేల్చడానికి మహదేవి సాగించే అన్వేషణ, ఆమెను ఒక నిషేధించిన అడవిలోని గుహ వైపు నడిపిస్తుంది.

దైవశక్తికి దుష్టశక్తికి పోరాటం

అక్కడ ఆమెకు 'అగధ' అనే భయానక దుష్టశక్తి ఎదురవుతుంది. దైవ శక్తికి, దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమాలోని ప్రధానాంశం. క్షుద్ర శక్తులు, కంటికి కనిపించని భయానక వాతావరణం, గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ రహస్యాలు ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తాయి.

ఎవరు ఏ పాత్రల్లో నటించారు

అగధ సినిమాలో మహదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల తన నటనతో మెప్పించగా, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రలు పోషించారు. అలనాటి నటుడు భానుచందర్, వనితా విజయకుమార్, జోవికా విజయకుమార్, షిజూ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు.

అగధ కలెక్షన్స్

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చామిడిశెట్టి ఛాయాగ్రహణం నిర్వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారత్‌లో రూ. 1.30 కోట్ల నికర వసూళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.44 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఆశించన స్థాయిలో రాని కలెక్షన్స్

అయితే, థియేట్రికల్ రన్‌లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా, డిజిటల్ వేదికలపై ఇలాంటి మిస్టరీ, క్షుద్ర పూజల నేపధ్యంలో సాగే కథలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.

అగధ ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగు హారర్ థ్రిల్లర్ అయిన అగధ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. జీ5లో అగధ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో జీ5లో అగధ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు జీ5 ఓటీటీలో అగధ సినిమాను ఎంచక్కా చూడొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More