...
...
Next Story

Airtel OTT Plan: ఒకే ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా 25 ఓటీటీలు.. 30 జీబీ డేటా.. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ అదిరిపోయింది

Airtel OTT Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 300 కన్నా తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన డేటా అండ్ ఓటీటీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 279 తో రీఛార్జ్ చేసుకునే యూజర్లకు నెలకు 30GB హై-స్పీడ్ డేటాతో పాటు మొత్తంగా 25 ఓటీటీలు లభిస్తాయి.

Published on: Nov 2, 2026, 14:12:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Airtel OTT Plan: స్మార్ట్‌ఫోన్లలో వినోదాన్ని కోరుకునే యూజర్ల కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) ఒక అదిరిపోయే డేటా వోచర్‌ను అందుబాటులో ఉంచింది. మీరు ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తూ, నెట్‌ఫ్లిక్స్ లేదా జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేవారైతే.. ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్ మీకోసమే.

Airtel OTT Plan: ఒకే ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా 25 ఓటీటీలు.. 30 జీబీ డేటా.. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ అదిరిపోయింది
Airtel OTT Plan: ఒకే ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సహా 25 ఓటీటీలు.. 30 జీబీ డేటా.. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ అదిరిపోయింది

కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే కాకుండా, పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే రీఛార్జ్‌తో అందించడం ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత. వీటిలో నెట్‌ఫ్లిక్స్ (Netflix Basic), జియోహాట్‌స్టార్ (JioHotstar Super), జీ5 (ZEE5 Premium), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) ఆఫర్లు లభిస్తాయి.

అయితే ఇది సాధారణ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ కాదు. కేవలం ఒక 'డేటా వోచర్' మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ముందు వినియోగదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనల వివరాలు ఇవే.

రూ. 279 ప్లాన్ లభించే ప్రయోజనాలు ఇవే

ఎయిర్‌టెల్ రూ. 279 డేటా వోచర్ రీఛార్జ్‌లో వినియోగదారులకు 1 నెల వ్యాలిడిటీతో మొత్తం 30GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఈ డేటా వినియోగానికి సంబంధించి రోజువారీ లిమిట్ ఏదీ ఉండదు. అంటే యూజర్లు తమ అవసరానికి తగినట్లుగా 30GB డేటాను నెలలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఎక్కువ డేటా అవసరమైన రోజుల్లో ఎక్కువగా, తక్కువ అవసరమున్న రోజుల్లో డేటాను దాచుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 ఉచిత సబ్‌స్క్రిప్షన్లు

అంతేకాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) ద్వారా మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది. వేర్వేరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయకూడదనుకునే మొబైల్ ప్రియులకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

రీఛార్జ్ చేసే ముందు గమనించాల్సిన ముఖ్యమైన షరతు

ఈ రూ. 279 ప్లాన్ తీసుకునే ముందు వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గమనించాలి. ఈ రీఛార్జ్ మీ మొబైల్ నంబర్‌కు ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీని (Service Validity) పెంచదు. ఎందుకంటే ఇది కేవలం ఒక డేటా వోచర్ (Data Voucher) మాత్రమే.

అంటే మీ మొబైల్ నంబర్‌లో ఇప్పటికే ఏదైనా అన్‌లిమిటెడ్ బేస్ ప్లాన్ (ఉదాహరణకు నెలకు సరిపడే రీఛార్జ్) ఆక్టివ్‌లో ఉంటేనే ఈ రూ. 279 డేటా వోచర్ పనిచేస్తుంది. బేస్ ప్లాన్ వ్యాలిడిటీ లేకపోతే కేవలం రూ. 279 తో రీఛార్జ్ చేసుకున్నంత మాత్రాన కాల్స్ చేయడం కానీ, నంబర్ యాక్టివ్‌గా ఉండటం కానీ జరగదు. కాబట్టి ఈ రీఛార్జ్ చేసే ముందే మీ నంబర్‌లో ఆక్టివ్ ప్లాన్ ఉందో లేదో సరిచూసుకోవాలి.

ప్రత్యామ్నాయంగా రూ. 200 ప్లాన్ కూడా లభ్యం

ఒకవేళ మీ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, మీకు నెట్‌ఫ్లిక్స్ అవసరం లేదు అనుకుంటే.. ఎయిర్‌టెల్‌లో రూ. 200 లభించే మరొక డేటా వోచర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 200 రీఛార్జ్ ప్లాన్‌లో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో 30GB డేటా లభిస్తుంది.

ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కి బదులుగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (Amazon Prime Video Mobile Edition), జియోహాట్‌స్టార్ మొబైల్, జీ5 ప్రీమియం, సోనీలివ్ (SonyLIV) సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రియులు రూ. 279 ప్లాన్‌ను, ప్రైమ్ వీడియో ప్రియులు రూ. 200 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks