Netflix OTT: దీపావ‌ళికి ఓటీటీలో ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా.. నెట్‌ఫ్లిక్స్ స్పెష‌ల్ మూవీ స్ట్రీమింగ్.. మ‌న‌సును తాకేలా!

Netflix OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ దీపావళికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతుంది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాను ఆడియన్స్ కు అందించబోతుంది. నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ గా తెరకెక్కిన ఆ సినిమా ఏంటీ? దాని పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Oct 27, 2026, 11:27:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix OTT: సాధారణంగా ప్రతి పండుగకు ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ పండుగ వాతావరణాన్ని, కుటుంబ విలువల గొప్పదనాన్ని గుర్తుచేసే సినిమాలు మాత్రం అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ 'దిల్‌వాలీ దీపావళి' సినిమా. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మూవీ రాబోతుంది.

దీపావ‌ళికి ఓటీటీలో ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా.. నెట్‌ఫ్లిక్స్ స్పెష‌ల్ మూవీ స్ట్రీమింగ్.. మ‌న‌సును తాకేలా! (x/NetflixIndia)
దీపావ‌ళికి ఓటీటీలో ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా.. నెట్‌ఫ్లిక్స్ స్పెష‌ల్ మూవీ స్ట్రీమింగ్.. మ‌న‌సును తాకేలా! (x/NetflixIndia)

దిల్‌వాలీ దీపావళి ఓటీటీ

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ దీపావళి పండుగకు ఓటీటీ లవర్స్ కు మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన దిల్‌వాలీ దీపావళి మూవీ ఈ దీపావళికి స్ట్రీమింగ్ కాబోతుంది. నవంబర్ 5న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.

స్టోరీ ఏంటంటే?

దిల్‌వాలీ దీపావళి సినిమా కథ ప్రధానంగా 'అన్ష్ సిక్కా' (మిహిర్ అహుజా) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అన్ష్.. పంజాబ్ లోని తన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని కలలు కంటాడు. అందుకోసం ఎన్నో ఏళ్లు కష్టపడి, ఓ పెద్ద హైరైజ్ బిల్డింగ్ లో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తాడు.

అయితే, దీపావళి పండుగ సందర్భంగా ఇంటికి తిరిగి వచ్చిన అన్ష్‌కు ఓ ఊహించని వాస్తవం ఎదురవుతుంది. కేవలం ఖరీదైన ఇల్లు, ఆధునిక సౌకర్యాలు మాత్రమే సంతోషాన్ని ఇవ్వవని, అది అసలైన ఇల్లుగా అనిపించుకోదని అర్థమవుతుంది. సుఖాలు, సౌకర్యాల కంటే బంధాలే ముఖ్యమని భావించే తల్లిదండ్రుల ఆలోచనలకు, నేటితరం యువకుడికి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్‌ను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా, కాస్త వినోదం జోడించి చూపించారు.

అద్భుతమైన నటీనటులు

దిల్‌వాలీ దీపావళి సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తండ్రి పాత్రలో సీనియర్ నటుడు మనోజ్ పహ్వా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆయనతో పాటు నీలు కోహ్లీ, ఔర్రా భట్నాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు తరాల మధ్య ఉన్న ఆలోచనా విధానాన్ని, అభిప్రాయభేదాలను దర్శకుడు రితేష్ మీనన్ తెరపై ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు.

ఈ సినిమాకు రీతూ మాగో అద్భుతమైన కథను అందించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ 'టెర్రిబ్లీ టైని టేల్స్' (TTT) ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్, TTT కాంబినేషన్‌లో వచ్చిన 'గ్రేటర్ కలేష్', 'ముసాఫిర్ కేఫ్' ప్రాజెక్టుల విజయాల స్ఫూర్తితో ఇప్పుడు ఈ పండుగ చిత్రాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో పండుగ సందడి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఎవరికి వారు ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బంధాల విలువను, 'ఇల్లు' అంటే కేవలం నాలుగు గోడలు కాదు మనుషుల మధ్య ఉన్న ప్రేమ అని చాటిచెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

ఈ దీపావళికి కుటుంబ సమేతంగా ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించడానికి 'దిల్‌వాలీ దీపావళి' ఒక బెస్ట్ ఛాయిస్. నవంబర్ 5వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More