నటి ఐశ్వర్య రాయ్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బుధవారం (నవంబర్ 19) నాడు పుట్టపర్తిలో జరిగిన ఈ వేడుకలలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కులం, మతం, ప్రేమపై పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చింది. ప్రసంగం తర్వాత ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకింది.
ఐశ్వర్య రాయ్ స్పీచ్ ఇలా..

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకల వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో సత్యసాయి బాబా సందేశాన్ని చెప్పింది. "ఒకే ఒక్క కులం ఉంది, అది మానవత్వం. ఒకే ఒక్క మతం ఉంది.. అది ప్రేమ అనే మతం. ఒకే ఒక్క భాష ఉంది.. అది హృదయం అనే భాష. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు.. ఆయన సర్వాంతర్యామి" అని ఐశ్వర్య చెప్పడం గమనార్హం.
తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత నటి ఐశ్వర్య రాయ్ వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి వినయపూర్వకంగా ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. అది చూసి మోదీ కూడా వెంటనే ఆమెకు నమస్కరిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అభిమానుల స్పందన
ఐశ్వర్య రాయ్ చేసిన ఈ పనిని అభిమానులు అభినందించారు. ఒక అభిమాని స్పందిస్తూ.. "ఒక కులం, ఒక మతం, ఒక దేవుడు అనే సత్యసాయి బాబా సందేశాన్ని ఐశ్వర్య రాయ్ ప్రతిధ్వనించడం ఈ యుగంలో అత్యంత ప్రభావవంతమైన ప్రసంగాలలో ఒకటి. గౌరవం, స్పష్టత, జ్ఞానం.. అన్నీ ఒకే ఫ్రేమ్‌లో" అని రాశారు.
మరొకరు స్పందిస్తూ.. "ఐశ్వర్య రాయ్ పీఎం మోదీ పాదాలను తాకడం.. కొన్ని క్షణాలకు హ్యాష్‌ట్యాగ్‌లు అవసరం లేదు.." అని అన్నారు. "సూపర్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమంలో పీఎం మోదీ పాదాలను తాకడం గొప్ప విషయం.. సంస్కారానికి కేరాఫ్ ఐశ్వర్య రాయ్" అని కొందరు కామెంట్ చేశారు.
{{/usCountry}}మరొకరు స్పందిస్తూ.. "ఐశ్వర్య రాయ్ పీఎం మోదీ పాదాలను తాకడం.. కొన్ని క్షణాలకు హ్యాష్‌ట్యాగ్‌లు అవసరం లేదు.." అని అన్నారు. "సూపర్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమంలో పీఎం మోదీ పాదాలను తాకడం గొప్ప విషయం.. సంస్కారానికి కేరాఫ్ ఐశ్వర్య రాయ్" అని కొందరు కామెంట్ చేశారు.
{{/usCountry}}