అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీయావర్ కులైగల్ నడుంగ. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ తెలుగు టీజర్ ను సన్ నెక్ట్స్ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 17) తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. అటు ఆహా వీడియోలోనూ ఈ సినిమా రానుంది.
మఫ్టీ పోలీస్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళంలో తీయావర్ కులైగల్ నడుంగ పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో మఫ్టీ పోలీస్ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం అంటే డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. “ఒంటిపై యూనిఫాం తీసేస్తే.. లోపల ఉన్న ఫైర్ బయటకు వస్తుంది. మఫ్టీ పోలీస్ డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్సన్ తో ట్వీట్ చేసింది. ఇప్పటికే తమిళ వెర్షన్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మఫ్టీ పోలీస్ మూవీ స్టోరీ ఇదే..
విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ తిరిగే ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇన్‌స్పెక్టర్ మగుడపాటి పాత్రలో అర్జున్ సర్జ ఆకట్టుకున్నాడు. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ సొంతం చేసుకుంది. అప్పుడే తెలుగులో మఫ్టీ పోలీస్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు.
ఈ మఫ్టీ పోలీస్ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఆకట్టుకునే ట్విస్టులు
{{/usCountry}}ఈ మఫ్టీ పోలీస్ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఆకట్టుకునే ట్విస్టులు
{{/usCountry}}ఈ మఫ్టీ పోలీస్ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యా నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఒక అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు.
ఈ కేసు విచారణ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జ) తీసుకుంటాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా ఉంటారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నారా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే ఈ మఫ్టీ పోలీస్ సినిమా చూడాల్సిందే.