...
...
Next Story

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పిచ్చిగా ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడీ లోకంలో లేరు!

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ తన క్రష్ ఎవరో ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ ఆమె ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడమే తీరని లోటు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చూడండి.

Published on: Jul 23, 2026, 16:22:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Aishwarya Rajesh: పాన్-ఇండియా రేంజ్‌లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్.. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై తనకు ఉన్న అమితమైన ఇష్టాన్ని బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. సుశాంత్ అంటే తనకు ఎంత పిచ్చి క్రష్ ఉందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయన నటించిన సినిమాలు చూసి తాను ఫిదా అయ్యానని, ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"సుశాంత్ నటన చూసి పూర్తిగా పడిపోయా!"

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పిచ్చిగా ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడీ లోకంలో లేరు!
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పిచ్చిగా ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడీ లోకంలో లేరు!

ఐశ్వర్య రాజేష్ తన ఇంటర్వ్యూలో సుశాంత్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. "పవిత్ర రిష్తా" సీరియల్ రోజుల నుంచే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఆకట్టుకుందని చెప్పారు. ఆ తర్వాత 'కై పో చే', 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాల్లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి తాను పూర్తిగా పడిపోయానని వెల్లడించారు.

ప్రతి పాత్రలోనూ సుశాంత్ చూపించే వేరియేషన్స్, డెడికేషన్ ఎంతోమంది యంగ్ యాక్టర్లకు స్ఫూర్తినిస్తాయని ఐశ్వర్య ప్రశంసించారు. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని బలంగా అనుకున్నానని, కానీ అంతలోనే ఆ చేదు నిజం వినాల్సి వస్తుందని ఊహించలేదని ఆవేదన చెందారు.

కంటెంట్ ఉన్న సినిమాలకే తొలి ప్రాధాన్యత

గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ కేవలం పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకోవడం ఐశ్వర్య రాజేష్ స్పెషాలిటీ. తమిళంలో వచ్చిన 'కాకా ముట్టై', 'కనా' (తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి) సినిమాలతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ భామ.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్', సాయి ధరమ్ తేజ్ సరసన 'రిపబ్లిక్', గతేడాది సంక్రాంతికి వస్తున్నాం, ఈ మధ్యే తిరువీర్ తో ఓ సుకుమారి చిత్రాల్లో నటించి తన యాక్టింగ్ స్టామినా నిరూపించుకున్నారు.

మరోవైపు 2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకస్మాత్తుగా దూరమవ్వడం భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నటించిన 'చిచోరే', 'కేదార్‌నాథ్', 'దిల్ బెచారా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా దగ్గరయ్యాయి.

సుశాంత్ లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిదని, ఆయన జ్ఞాపకాలు, సినిమాలు ఎప్పటికీ సినిమా లవర్స్ గుండెల్లో పదిలంగా ఉంటాయని ఐశ్వర్య కొనియాడారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe