...
...
Next Story

Rayavalasa Teaser: కొడుకు హీరో, తల్లి డైరెక్టర్, తండ్రి నిర్మాత- రాయవలస టీజర్ రిలీజ్.. హీరో ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్

Rayavalasa Teaser Released Akash Jagannadh Speech: ఒకే ఫ్యామిలీ నుంచి హీరో, డైరెక్టర్, నిర్మాత వస్తున్న లేటెస్ట్ సినిమా రాయవలస. కార్తీక్ జయంతి హీరోగా, రాధిక జయంతి దర్శకురాలిగా, గోపీ కృష్ణ జె నిర్మాతగా తెరకెక్కిన రాయవలస టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: May 9, 2026, 16:56:37 IST
Advertisement

Akash Jagannadh Speech Rayavalasa Teaser Launch Event: కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్న సినిమా రాయవలస. ఈ సినిమాను రాయసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించారు. రాయవలస సినిమాకు మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. కార్తీక్ జయంతి తల్లి అయిన రాధిక జయంతి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

రాయవలస టీజర్ లాంచ్ ఈవెంట్

కొడుకు హీరో, తల్లి డైరెక్టర్, తండ్రి నిర్మాత- రాయవలస టీజర్ రిలీజ్.. హీరో ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్
కొడుకు హీరో, తల్లి డైరెక్టర్, తండ్రి నిర్మాత- రాయవలస టీజర్ రిలీజ్.. హీరో ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్

లవ్ టైడ్ బై ఫేట్ (Love Tied by Fate) అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల విడుదలైన రాయవలస ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ (మే 8) రాయవలస టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం రాయవలస టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆకాష్ జగన్నాథ్.

ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్

ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా, వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది" అని అన్నారు.

అన్ని విషయాల్లో అవగాహన ఉంది

"రాధిక గారికి హ్యాట్సాఫ్. తాను పెద్ద బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆకాష్ జగన్నాథ్ తెలిపాడు.

చాలా పెద్ద హిట్ అవ్వాలి

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం. తల్లి డైరెక్ట్ చేయడం, ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం, కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ముగ్గురూ ఒకే ఫ్యామిలీ కావడం వల్ల సినిమా ఇంకా ఈజీ అయింది" అని అన్నారు.

11 ఏళ్లుగా

"11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు. తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను" అని చెప్పారు కేఎల్ దామోదర్ ప్రసాద్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe