...
...
Next Story

అఖండ ఓ సూపర్ హీరో.. అష్ట సిద్ధి సాధించినవాడు.. మ్యాజిక్ కాదు లాజిక్ ఉంది: ట్రోల్స్‌పై స్పందించిన బోయపాటి శ్రీను

అఖండ 2 మూవీపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించాడు. అతడో సూపర్ హీరో అని, అష్ట సిద్ధి సాధించినవాడని చెప్పడం విశేషం. సినిమాలో మ్యాజిక్ కాదు లాజిక్ కూడా ఉందని స్పష్టం చేశాడు.

Published on: Dec 14, 2025, 08:56:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీపై ప్రీమియర్ షోల నుంచే దారుణమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలుసు కదా. ఇందులో బాలయ్యను చూపించిన విధానంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఇది మంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. అయితే దీనిపై తాజాగా బోయపాటి శ్రీను స్పందించాడు.

అఖండ ఓ సూపర్ హ్యూమన్

అఖండ ఓ సూపర్ హీరో.. అష్ట సిద్ధి సాధించినవాడు.. మ్యాజిక్ కాదు లాజిక్ ఉంది: ట్రోల్స్‌పై స్పందించిన బోయపాటి శ్రీను
అఖండ ఓ సూపర్ హీరో.. అష్ట సిద్ధి సాధించినవాడు.. మ్యాజిక్ కాదు లాజిక్ ఉంది: ట్రోల్స్‌పై స్పందించిన బోయపాటి శ్రీను

అఖండ 2 మూవీపై వస్తున్న ట్రోల్స్ పై ఓ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడాడు. బాలకృష్ణను ఈ సినిమాలో ఎందుకు అలా చూపించామో వివరించాడు. నిజానికి మొదటి రీల్లోనే ఆయన అష్ట సిద్ధి సాధించాడని చెప్పి లాజిక్ కూడా ఇచ్చినట్లు తెలిపాడు.

“ఆయన అష్ట సిద్ధి సాధించినవాడు. 12 ఏళ్ల పాటు అష్ట దిగ్బంధనానికి వెళ్లి అష్ట సిద్ధి సాధించాడు. అఖండ ఓ సూపర్ హ్యూమన్. వాళ్లకసలు లాజిక్కా, మ్యాజిక్కా అనేది తీసేస్తే.. వాళ్లు సూక్ష్మ రూపంలోకి లేదంటే విశ్వరూపంలోకి కూడా వెళ్లగలరు. కానీ అవన్నీ ఇందులో చూపించలేదు. కేవలం ఆయుధాల వరకూ చూపించాము. అష్ట సిద్ధి సాధించిన వ్యక్తి ఓ సూపర్ హీరో. వాళ్లు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. అష్ట సిద్ధి సాధకుడు ఏదైనా చేయగలడు. మన హీరో అష్ట సిద్ధి సాధకుడు అని మొదటి రీల్లోనే చెప్పేశాం. అందువల్ల లాజిక్ కూడా ఉంది” అని బోయపాటి వివరణ ఇచ్చాడు.

అఖండ 2 మూవీ గురించి..

అఖండ 2 మూవీ వారం ఆలస్యంగా డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. బాలకృష్ణ, సంయుక్త నటించారు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. నాలుగేళ్ల కిందట వచ్చిన అఖండకు కొనసాగింపుగా వచ్చింది.

సినిమా కథ అంతా టిబెట్ సరిహద్దుల దగ్గర జరుగుతుంది. దేవుడని ఎక్కువ నమ్మే భారతీయల మనసుల్లో దైవత్వంపై దెబ్బకొట్టాలని చైనా పన్నాగం పన్నడం, అందుకు బయోవార్ ఉపయోగించుకోవడం, దానికి విరుగుడుగా భారత్ సైంటిస్టులు కనిపెట్టడం వంటి సీన్లతో అలా సాగిపోతుంది సినిమా. అయితే ఈ మూవీపై తొలి షో నుంచే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన ఫైట్ సీన్స్ చూసి తెగ నవ్వుకున్నారు. అలా ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. దీనికే తాజాగా బోయపాటి శ్రీను వివరణ ఇవ్వడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks