Akkineni Akhil: ఏజెంట్ డిజాస్టర్ అవుతుందని రిలీజ్‌కు ముందే తెలుసు, నాపై గౌరవం లేకుండా పోయింది: అక్కినేని అఖిల్ కామెంట్స్
Akkineni Akhil On Agent Flop: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల నటించిన 'లెనిన్' చిత్రంతో మాస్ విజయాన్ని అందుకొని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సంతోష సమయంలో తన కెరీర్‌లో ఎదురైన అతిపెద్ద డిజాస్టర్ 'ఏజెంట్' చిత్రంపై అక్కినేని అఖిల్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
Akkineni Akhil Comments On Agent Movie Flop: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంతో తనలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించారు అఖిల్. అర్బన్ లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనబెట్టి, రస్టిక్ మాస్ అవతారంలో ఆయన చూపించిన నటనను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.

ఏజెంట్ సినిమా రిజల్ట్ గురించి
గతంలో వచ్చిన 'ఏజెంట్' తీవ్ర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ విజయం అఖిల్‌కు, అక్కినేని అభిమానులకు కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న అఖిల్ అక్కినేని తన 'ఏజెంట్' సినిమా రిజల్ట్ గురించి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
'నాపై నాకు గౌరవం లేకుండా పోయింది'
'రా టాక్స్ విత్ వికే' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ ఏజెంట్ సినిమా విఫలం కావడంపై ఓపెన్‌గా మాట్లాడారు. "ఒక హిట్ సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్‌లు కలిసి పనిచేయాలి. చిత్రం ఆడకపోయినా, నటుడిగా నా పాత్రకు న్యాయం చేశాననే నమ్మకం ఉండాలి. అప్పుడే పరిశ్రమలో నటుడిగా గౌరవం దక్కుతుంది. కానీ ఏజెంట్ షూటింగ్ సమయంలో నటుడిగా నన్ను నేను గౌరవించుకోలేకపోయాను. ఫస్ట్ ఎడిట్, కొన్ని సీన్లు చూసినప్పుడే నాకు ఎన్నో అనుమానాలు వచ్చాయి" అని అఖిల్ తన మనసులోని నిరాశను బయటపెట్టారు.
నిర్మాత కోసమే ముందుకు వెళ్లా!
సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడదని ముందే గ్రహించినా వెనకడుగు వేయలేకపోయానని అఖిల్ అక్కినేని వెల్లడించారు. "ఏజెంట్ సినిమా ఫలితం తేడా కొట్టబోతోందని విడుదల ముందే నాకు అర్థమైంది. నా స్నేహితులతో కూడా ఇదే విషయాన్ని పంచుకున్నాను. కానీ, ప్రాజెక్ట్ మధ్యలో ఉండి తప్పుకోవడం సరైన పద్ధతి కాదు" అని అక్కినేని అఖిల్ అన్నారు.
"నా సినిమా కోసం కోట్లు కుమ్మరించిన నిర్మాత పెట్టుబడిని రాబట్టడం నా నైతిక బాధ్యత. అందుకే సమస్య ఉందని తెలిసినా, మరింత కష్టపడి పనిచేశాను. అయితే అలాంటి సినిమాలు తీసే రోజులు చెల్లిపోయాయి" అని హీరో అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చారు.
పరాజయాన్ని తుడిచేసిన 'లెనిన్' రికార్డు వసూళ్లు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 15 కోట్ల లోపే వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి, కథల ఎంపికలో మార్పుల కోసం అఖిల్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు.
అనంతరం మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రంతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్ అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి అక్కినేని అఖిల్ కెరీర్‌లోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది.
బలమైన పునాది
ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముందుగా హీరోయిన్‌గా శ్రీలీల అనుకున్న మేకర్స్ తర్వాత భాగ్యశ్రీకి అవకాశం ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తున్న లెనిన్ సినిమా అఖిల్ అక్కినేని సినీ కెరీర్‌కు మళ్లీ బలమైన పునాది వేసిందని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


