King100 Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాడు. వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ క్యాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఏకంగా 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నాగ్ కు జోడీగా టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ టబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వెరైటీ ఇండియా కథనం వెల్లడించింది. అయితే ఈసారి ఆమె హీరోయిన్ కాదు, పవర్ఫుల్ విలన్ అవతారమెత్తడం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్.
అప్పుడు నిన్నే పెళ్లాడతా అంటూ..

1996లో వచ్చిన రొమాంటిక్ డ్రామా 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన నాగార్జున, టబు.. మళ్లీ ఇన్నేళ్లకు ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. ఆ తర్వాత 'సిసింద్రీ', 'ఆవిడా మా ఆవిడే' (1998) లాంటి సినిమాల్లో కలిసి నటించి స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. అప్పటినుంచి మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయలేదు.
ఇన్నేళ్లకు ఆడియన్స్ కు ఒక సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి డైరెక్టర్ ఆర్.ఏ. కార్తీక్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. నాగార్జున కటౌట్ కు సరిపోయేలా టబు క్యారెక్టర్ ను చాలా క్రూరంగా డిజైన్ చేశారని వెరైటీ ఇండియా కథనం తెలిపింది.
నెగిటివ్ రోల్స్ లో టబు విశ్వరూపం
నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం టబుకు కొత్తేం కాదు. ‘మక్బూల్’లో నిమ్మి పాత్ర, 'ఫితూర్' లో బేగం హజ్రత్ జాన్, 'హైదర్' లో గజాలా మీర్ క్యారెక్టర్స్ లో టబు తన యాక్టింగ్ విశ్వరూపం చూపించింది.
ముఖ్యంగా 'అంధాధున్' లో ఏమాత్రం కనికరం లేని సిమి క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ మైండ్ లో అలా బలంగా ఉండిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ గ్రీకువీరుడికి విలన్ గా టబు పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అటు ఇంటర్నేషనల్.. ఇటు పాన్ ఇండియా క్రేజ్
{{/usCountry}}ముఖ్యంగా 'అంధాధున్' లో ఏమాత్రం కనికరం లేని సిమి క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ మైండ్ లో అలా బలంగా ఉండిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ గ్రీకువీరుడికి విలన్ గా టబు పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అటు ఇంటర్నేషనల్.. ఇటు పాన్ ఇండియా క్రేజ్
{{/usCountry}}రీసెంట్ గా టబు హారర్-కామెడీ మూవీ 'భూత్ బంగ్లా' లో అక్షయ్ కుమార్, వామికా గబ్బి, పరేష్ రావల్ తో కలిసి మెప్పించింది. అలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ హెచ్ బీ ఓ (HBO) సిరీస్ 'డ్యూన్: ప్రొఫెసీ' లో సిస్టర్ ఫ్రాన్సెస్కా క్యారెక్టర్ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి గ్లోబల్ రీచ్ ఉన్న సీనియర్ నటి 'కింగ్ 100' లోకి రావడం సినిమా లెవెల్ ను అమాంతం పెంచేసింది.
మరోవైపు నాగార్జున ట్రాక్ రికార్డ్ కూడా మామూలుగా లేదు. రామ్ గోపాల్ వర్మ 'శివ' (1989) తో హిందీలో ఎంట్రీ ఇచ్చి ఖుదా గవా, ద్రోహి, క్రిమినల్, జఖ్మ్, ఎల్ఓసీ కార్గిల్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేశాడు. చివరిగా 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ' తో పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, రష్మిక మందన్న తో కలిసి చేసిన 'కుబేర' సినిమాతో కూడా నాగ్ భారీ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తన 100వ సినిమాతో టబుకి గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టడం గ్యారెంటీ.