Nagarjuna: తెలుగు టెలివిజన్ రంగాన్ని ఊపేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ 10 తెలుగు స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) తనదైన స్టైలిష్ హోస్టింగ్‌తో ఈ షోను గత కొన్ని సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు కొత్త సీజన్ కోసం నాగ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు టాక్.
హోస్ట్ గా నాగార్జున

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. గత కొన్ని సీజన్లుగా అతనే షోను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు నాగ్ ఇచ్చే క్లాసులు, కంటెస్టెంట్లపై వేసే పంచ్‌ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మైలురాయి లాంటి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' తో ఆయన మళ్లీ హోస్ట్‌గా అలరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సీజన్ కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీజన్ 9 కంటే భారీగా
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హోస్టింగ్ కోసం నాగార్జున ఏకంగా రూ. 40 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను అందుకోబోతున్నారటా. ఇప్పుడీ టాపిక్ సంచలనంగా మారింది.
గత సీజన్ (సీజన్ 9) లో నాగార్జున దాదాపు రూ.35 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి షో రేటింగ్‌లు, క్రేజ్, సీజన్ 10 ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ నాగార్జున అడిగినంత ఇవ్వడానికి వెనకాడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ గత సీజన్ కంటే ఈసారి రూ.5 కోట్లు అదనంగా పెరగడం విశేషమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
హైయెస్ట్ పెయిడ్ హోస్ట్
ఈ రికార్డ్ బ్రేకింగ్ అమౌంట్‌తో సౌత్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హోస్ట్‌లలో నాగార్జున అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాగార్జున బ్రాండ్ వాల్యూ వల్లే బిగ్ బాస్ షోకు భారీగా టీఆర్పీ (TRP) రేటింగ్‌లు, స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి. అందుకే స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థలు ఈ భారీ పారితోషికానికి ఓకే చెప్పినట్లు టాక్.
{{/usCountry}}ఈ రికార్డ్ బ్రేకింగ్ అమౌంట్‌తో సౌత్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హోస్ట్‌లలో నాగార్జున అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాగార్జున బ్రాండ్ వాల్యూ వల్లే బిగ్ బాస్ షోకు భారీగా టీఆర్పీ (TRP) రేటింగ్‌లు, స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి. అందుకే స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థలు ఈ భారీ పారితోషికానికి ఓకే చెప్పినట్లు టాక్.
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగుకు ఇది మైలురాయి లాంటి 10వ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు కూడా మునుపటి కంటే చాలా ఇంటెన్స్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారటా. ఇప్పటికే అగ్నిపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది.