Nagarjuna Bigg Boss 10: ఎక్స్‌ట్రాలు చేస్తే ఊరుకోను: బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్లకు నాగార్జున మాస్ వార్నింగ్
Nagarjuna Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు వచ్చే నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున అప్పుడే కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి హౌస్ లో హద్దులు మీరొద్దని స్పష్టం చేశారు.
Nagarjuna Bigg Boss 10: బుల్లితెరపై మోస్ట్ పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' (Bigg Boss Telugu) పదో సీజన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈ ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ ప్రారంభం కాకముందే కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. షోలో అసభ్య పదజాలం వాడినా, హద్దులు దాటి ప్రవర్తించినా అస్సలు ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.

వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నాగార్జున బిగ్ బాస్ 10, తన మైల్‌స్టోన్ 100వ చిత్రం 'కింగ్100' గురించిన విశేషాలను వివరంగా పంచుకున్నారు.
బిగ్ బాస్ 10 ప్రమో షూట్ కంప్లీట్.. ఈసారి కొత్త రూల్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ 10 ప్రోమో షూటింగ్‌ను నాగార్జున గ్రాండ్‌గా పూర్తి చేశారు. గత ఏడేళ్లుగా ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేస్తున్న ఆయన.. ఈ 10వ యానివర్సరీ సీజన్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
ఈసారి కంటెస్టెంట్లు ఎవరో ముందే తెలుసుకోవద్దని నాగ్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. స్టేజ్ పైకి వారు వచ్చినప్పుడు ఆర్గానిక్ వేలో, ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా క్వశ్చన్స్ అడగడానికే ఈ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
"ఫ్యామిలీలు చూసే షో.. హద్దులు దాటితే ఊరుకోను!"
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ప్రవర్తన, క్రమశిక్షణపై నాగార్జున చాలా ఓపెన్‌గా మాట్లాడారు. "బిగ్ బాస్ షోను ఇంట్లో పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి చూస్తారు. అలాంటప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ వాడినా, గౌరవం లేకుండా హద్దు మీరి ప్రవర్తించినా నేను అస్సలు సహించను" అని నాగ్ తేల్చి చెప్పారు.
గత సీజన్ బిగ్ హిట్ కావడంతో ఈసారి ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా గేమ్ ప్లాన్‌ను మార్చేశామని చెప్పారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఫిజికల్ టాస్కులు, ఛాలెంజ్‌లు చాలా టఫ్‌గా ఉండబోతున్నట్లు బిగ్ హింట్ ఇచ్చారు.
సల్మాన్, మోహన్‌లాల్ కాంబో.. హోస్ట్‌ల ముచ్చట్లు
ఇతర భాషల్లో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, మోహన్ లాల్, కమల్ హాసన్‌లతో తనకున్న ఫ్రెండ్‌షిప్‌ను నాగార్జున గుర్తుచేసుకున్నారు. తామంతా కలిసినప్పుడు చాలా క్యాజువల్‌గా షోల గురించి డిస్కస్ చేసుకుంటామని వెల్లడించారు.
అయితే భాషల సమస్య కారణంగానే ఇతర భాషల్లో క్రాసోవర్ ప్రయత్నించలేదని చెప్పారు. తనకు ఇంగ్లీష్, తెలుగు భాషల్లోనే ఆలోచించడం, మాట్లాడటం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని నాగ్ వివరించారు.
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కింగ్100' ఫస్ట్ లుక్ రెడీ
మరోవైపు అక్కినేని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నాగార్జున 100వ సినిమా 'కింగ్100' (King100)పై కూడా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వర్సటైల్ నటి టబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా, ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోందని నాగార్జున తెలిపారు. అతిత్వరలోనే అభిమానులను అలరించేలా ఈ మూవీ మోస్ట్ అవేటెడ్ 'ఫస్ట్ లుక్' పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


