Nagarjuna: ఏడాది ముందే రిలీజ్ డేట్ చెప్పారు.. ఆ పని మనమెందుకు చేయలేకపోతున్నాం.. నేనూ లెనిన్ వాయిదా వేశాను: నాగార్జున
Nagarjuna: నాగార్జున హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీని ఉదాహరణగా చెబుతూ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు ఓ ఛాలెంజ్ విసిరారు. ఆ మూవీలాగా మనం ఎందుకు ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాం.. ఒకవేళ చేసినా ఎందుకు వాయిదా వేస్తున్నాం అని ప్రశ్నించడం గమనార్హం.
Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండస్ట్రీలో ఒక పెద్ద డిబేట్‌కు తెరలేపారు. తన కొడుకు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'లెనిన్' సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాలు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్లను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' ప్లానింగ్‌ను ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ టాలీవుడ్‌ను కడిగిపారేశారు.

అది మనమెందుకు చేయలేకపోతున్నాం
హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన 'ది ఒడిస్సీ' రిలీజ్ డేట్‌ను ఏడాది ముందే అనౌన్స్ చేశారని నాగార్జున గుర్తుచేశారు. ఆ టైమ్‌కే ఆ సినిమాను పక్కాగా థియేటర్లలోకి తెచ్చారని, మరి మన తెలుగు ఇండస్ట్రీలో ముందే డేట్లు చెప్పి ఎందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో తప్పు తన వైపు కూడా ఉందని, రీసెంట్ గా వచ్చిన 'లెనిన్' సినిమాను కూడా తాము పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నారు.
'నిన్నే పెళ్లాడుతా', 'అన్నమయ్య' రోజుల్లో అలా ఉండేది
టెక్నికల్ వర్క్ పూర్తి కాకపోవడం వల్లే తాము 'లెనిన్' మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని నాగ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన 'నిన్నే పెళ్లాడుతా', 'అన్నమయ్య' సినిమాల రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే ఫైనల్ కాపీలు చేతిలో రెడీగా ఉండేవని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా ఎందుకు లాస్ట్ మినిట్ వరకు కంగారు పడుతున్నామో అర్థం కావడం లేదన్నారు.
ఈ ప్రశ్నను తాను ఇండస్ట్రీతో పాటు తనను తాను కూడా అడుగుతున్నానని కింగ్ చెప్పారు. సినిమా బాగుండాలన్నా, ఇండస్ట్రీ సేఫ్‌గా ఉండాలన్నా రిలీజ్ డేట్ కంటే ముందే ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునే పద్ధతిని మళ్లీ తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అఖిల్ 'లెనిన్' సక్సెస్.. ఎమోషనల్ అయిన కింగ్
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ ప్లే చేసిన 'లెనిన్' సినిమాను డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను నాగార్జునతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ కలిసి గ్రాండ్‌గా నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అఖిల్‌కు మంచి కంబ్యాక్ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
సక్సెస్ ఈవెంట్‌లో నాగార్జున తన కొడుకు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో అఖిల్ కు జరిగిన ప్రమాదం, ఆ తర్వాత తను కోలుకుని ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి ఒక తండ్రిగా గర్వపడుతున్నట్లు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయిందని థాంక్స్ చెప్పారు. ఎస్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని ప్రశంసించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


