...
...
Next Story

పార్టీలో అతన్ని కొట్టాను, నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా.. తాను చేసిన అతిపెద్ద తప్పు చెప్పిన స్టార్ హీరో అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో, కన్నప్ప యాక్టర్ అక్షయ్ కుమార్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పును బయటపెట్టారు. ఒక పెద్ద పార్టీలో సహనం కోల్పోయి ఒక వ్యక్తిని కొట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ రోజు తన కెరీర్ ఏమైపోతుందో అని వణికిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.

Published on: Feb 15, 2026, 11:11:58 IST
Advertisement

బాలీవుడ్ యాక్షన్ స్టార్, కన్నప్ప యాక్టర్ (శివుడి పాత్ర) అక్షయ్ కుమార్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణతో, వివాదాలకు దూరంగా ఉండే అక్షయ్.. తన జీవితంలో ఒకే ఒక్క తప్పు వల్ల సినిమా కెరీర్ ప్రమాదంలో పడిందని తాజాగా వెల్లడించారు.

వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ షోలో

పార్టీలో అతన్ని కొట్టాను, నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా.. తాను చేసిన అతిపెద్ద తప్పు చెప్పిన స్టార్ హీరో అక్షయ్ కుమార్
పార్టీలో అతన్ని కొట్టాను, నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా.. తాను చేసిన అతిపెద్ద తప్పు చెప్పిన స్టార్ హీరో అక్షయ్ కుమార్

సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్’ (Wheel of Fortune) షోలో అతిథులుగా వచ్చిన ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ జడ్జిలు అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్, నమితా థాపర్లతో ముచ్చటిస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఖిలాడీ అక్షయ్ కుమార్.

ఆవేశంలో జరిగిన ఘోరం

అమన్ గుప్తా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అక్షయ్ కుమార్ తన జీవితంలోని అత్యంత ఇబ్బందికరమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం తన సన్నిహిత మిత్రుడితో కలిసి ఒక పెద్ద పార్టీకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని, అక్కడ ఒక వ్యక్తి తన స్నేహితుడిని ఉద్దేశించి చాలా అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడని అక్షయ్ తెలిపారు.

ఒకటికి పదిసార్లు హెచ్చరించా

"అతడు నా స్నేహితుడిని తిడుతుంటే వద్దని ఒకటికి పదిసార్లు హెచ్చరించాను. కానీ, ఆ వ్యక్తి ఆగకుండా నా స్నేహితుడి వ్యక్తిగత విషయాల గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. దాంతో నా స్నేహితుడు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది" అని అక్షయ్ కుమార్ వివరించారు.

చెంప దెబ్బకు స్పృహ తప్పిన వ్యక్తి

"చుట్టూ చాలా మంది ఉన్న పెద్ద పార్టీ అది. అతడు పడిపోవడంతో నా కెరీర్ ముగిసిపోయిందని, ఇక నా భవిష్యత్తు శూన్యమని భయం వేసింది. అతడి మొహంపై నీళ్లు చల్లుతూ.. భగవంతుడా అతడికి స్పృహ వచ్చేలా చూడు అని మొక్కుకున్నాను" అంటూ ఆనాడు తాను వణికిపోయిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు అక్షయ్ కుమార్.

పెద్ద తప్పుగా భావిస్తా

చివరికి ఆ వ్యక్తికి స్పృహ రావడంతో అక్షయ్ కుమార్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ రోజు చేసిన పనిని తాను ఇప్పటికీ ఒక పెద్ద తప్పుగా భావిస్తానని ఆయన అన్నారు. "ఈ రోజుల్లో అయితే అలాంటి సందర్భాల్లో నేను అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతాను తప్ప.. అలా ఎప్పటికీ స్పందించను" అని తన పరిణతిని చాటుకున్నారు అక్షయ్.

సినిమా విశేషాలు

ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హారర్ కామెడీ ‘భూత్ బంగ్లా’తో పాటు ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘హైవాన్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే ‘వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు ఖిలాడీ అక్షయ్ కుమార్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks