Rajigadu Rajayyadu: రంగస్థల నటులతో మూస మూవీలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు-3 సార్లు చూసిన బోర్ కొట్టలేదన్న గోరటి వెంకన్న

Altaf Hassan Rajigadu Rajayyadu Teaser Launch: తెలుగులో వచ్చిన బట్టల రామస్వామి బయోపిక్కు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్తాఫ్ హాసన్. అయితే అల్తాఫ్ హాసన్ హీరోగా, దర్శకత్వం వహించిన నయా మూవీ రాజిగాడు రాజయ్యాడు. తాజాగా నిర్వహించిన టీజర్ లాంచ్‌లో గోరటి వెంకన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Nov 19, 2026, 20:08:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Altaf Hassan Rajigadu Rajayyadu Teaser Launch: "బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "రాజిగాడు రాజయ్యాడు".

రంగస్థల నటులతో మూస మూవీలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు-3 సార్లు చూసిన బోర్ కొట్టలేదన్న గోరటి వెంకన్న
రంగస్థల నటులతో మూస మూవీలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు-3 సార్లు చూసిన బోర్ కొట్టలేదన్న గోరటి వెంకన్న

రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంచ్

ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్‌పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు రాజిగాడు రాజయ్యాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

మంచి కాన్సెప్టుతో వస్తున్న సినిమా

ఈ కార్యక్రమంలో నటుడు కేశవ మాట్లాడుతూ.. "మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న చిత్రమిది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను మీరు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది

నటుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్‌లోనే ఒక రిథమ్ ఉంది. ఈ టైటిల్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. నేను ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ అల్తాఫ్ గారికి థ్యాంక్స్" అని చెప్పారు.

టి కృష్ణ సినిమాలు ఎలా ఉండేవో

నటుడు శివకుమార్ కాముని మాట్లాడుతూ.. "అప్పట్లో టి కృష్ణ గారి సినిమాలు ఎలా ఉండేవో అలా సామాజిక చైతన్యాన్ని కలిగించే చిత్రమిది. ఈ సినిమాలో నేను విలన్ బావమరిది క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. మీ ఆదదరణ కోరుతూ త్వరలోనే మా మూవీ ముందుకు రాబోతోంది" అని వెల్లడించారు.

మాలాంటి రంగస్థల నటులతో

నటుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "ఫేమస్ అయిన ఆర్టిస్టులతోనే సినిమాలు చేయాలని మేకర్స్ కోరుకుంటారు. కానీ మాలాంటి రంగస్థల నటులతో సినిమా చేసినందుకు మా డైరెక్టర్, హీరో అల్తాఫ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని చెప్పుకొచ్చారు.

కళకు అలాంటి బేధం లేదు

గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ.. "చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలు కొందరు సృష్టించినవి. కానీ కళ అయిన సినిమాకు అలాంటి బేధం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ బేధాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుంది" అని అన్నారు.

ఆయన నాటకానికి నంది అవార్డ్స్ వచ్చాయి

"ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అవార్డ్స్ పొందిన వారు. ఆయన నాటకం కూడా నంది పురస్కారాలు పొందింది. అలాంటి గొప్ప కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు అల్తాఫ్. నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా ఎప్పుడూ బోర్ రాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి" అని గోరటి వెంకన్న తెలిపారు.

ఒక జీవితాన్ని చూసిన ఫీల్

"మూస చిత్రాలకు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ కూడా చేశాను. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు. ఒక జీవితాన్ని చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్‌గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి" అని గోరటి వెంకన్న కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More