సైకలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్ ది మేజ్ ట్రైలర్.. నేను ప్రొఫెసర్‌లా అయితే ఆయన స్టూడెంట్‌లాగే ఉన్నారన్న డైరెక్టర్

The Maze Trailer Launch Rahul Ravindran: హీరో శ్రీరామ్ నటించిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ది మేజ్. తాజాగా ది మేజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ది మేజ్ ట్రైలర్ లాంచ్‌కు హాజరైన డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 16, 2026, 14:13:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Maze Trailer Launch Rahul Ravindran: తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్ ది మేజ్ ట్రైలర్.. నేను ప్రొఫెసర్‌లా అయితే ఆయన స్టూడెంట్‌లాగే ఉన్నారన్న డైరెక్టర్
సైకలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్ ది మేజ్ ట్రైలర్.. నేను ప్రొఫెసర్‌లా అయితే ఆయన స్టూడెంట్‌లాగే ఉన్నారన్న డైరెక్టర్

ది మేజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.

"ది మేజ్" చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. త్వరలో ది మేజ్ సినిమా గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా నవంబర్ 15న ది మేజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

అతిథులుగా మధుర శ్రీధర్, రాహుల్ రవీంద్రన్

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ది మేజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవోపీ శివకృష్ణ మాట్లాడుతూ.. "మా మూవీ చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. విజువల్ పరంగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చే చిత్రమిది" అని అన్నారు.

నటి శ్రీష మాట్లాడుతూ.. "మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ సినిమాలో హారిక పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. హీరో శ్రీరామ్ ఫ్రెండ్లీగా ఉంటూ మాకు సపోర్ట్ అందించారు" అని తెలిపారు.

ఆయన మాత్రం స్టూడెంట్ లాగే

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "ది మేజ్ సినిమా ప్రారంభమయ్యే టైమ్‌లో దర్శకుడు నాకు ఈ కథ చెప్పారు. నేను విన్న కథ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సర్‌ప్రైజ్ అయ్యేలా కథ చెప్పినదాని కంటే చాలా బాగా రూపొందించారు. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు ఎంతో ప్యాషన్‌తో పనిచేసినట్లు తెలుస్తోంది" అని అన్నారు.

"నేను చెన్నైలో పుట్టి పెరిగా కాబట్టి నాకు శ్రీరామ్ గారు శ్రీకాంత్ గానే పరిచయం. నేను కాలేజ్‌లో ఉండగా శ్రీరామ్ గారి సినిమాలు చూశాను. ఇప్పుడు నేను ప్రొఫెసర్‌లా అయ్యాను. ఆయన స్టూడెంట్‌లాగే ఉన్నారు. సిన్సియర్‌గా వర్క్ చేస్తూ వెళ్తుంటే తప్పకుండా సక్సెస్ వస్తుందని శ్రీరామ్ గారు చెప్పిన మాట మనందరికీ ఒక మెసేజ్‌లా తీసుకోవచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా" అని నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆకాంక్షించారు.

సెకండాఫ్ చూపు తిప్పుకోలేకపోయాను

నిర్మాత డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ.. "ఈ సినిమా కథ చెప్పినప్పటి కంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఎక్కువ థ్రిల్ అయ్యాను. ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు సెకండాఫ్ చూపు తిప్పుకోలేకపోయాను. అంత గ్రిప్పింగ్‌గా రూపొందించారు మా డైరెక్టర్" అని చెప్పారు.

"ఈ సినిమాలో శ్రీరామ్ గారు జాయిన్ అవడంతో మరింత స్ట్రాంగ్ ప్రాజెక్ట్ అయింది. మా చిత్రంలో హీరో శ్రీరామ్, ఇద్దరు హీరోయిన్స్ బాగా పర్‌ఫార్మ్ చేశారు. నాకు సినిమాలంటే పెద్ద ఆసక్తి ఉండదు. కానీ ఇలాంటి ప్రాజెక్ట్‌లలో భాగమవడం సంతోషంగా ఉంది" అని ప్రొడ్యూసర్ ఉదయ్ కె రెడ్డి పాల్వాయి పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More