...
...
Next Story

Alia Bhatt: ఇంట్లో మా కూతురే యానిమల్, ఆల్ఫా, అన్నీ.. మా ఇద్దరిదీ ఏమీ నడవదు: ఆలియా భట్ కామెంట్స్

Alia Bhatt: ఆలియా భట్ నటిస్తున్న ఆల్ఫా మూవీ రిలీజ్ కు సిద్ధమైన వేళ ఆమె ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన కూతురు రాహా కపూర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 30, 2026, 14:26:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ స్క్రీన్ మీద ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ కొట్టినా, వందల కోట్లు వసూలు చేసినా ఇంట్లో మాత్రం వాళ్ల ఆటలు సాగడం లేదు. తన అప్‌కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ సీక్రెట్‌ను బయటపెట్టింది.

Alia Bhatt: ఇంట్లో మా కూతురే యానిమల్, ఆల్ఫా, అన్నీ.. మా ఇద్దరిదీ ఏమీ నడవదు: ఆలియా భట్ కామెంట్స్
Alia Bhatt: ఇంట్లో మా కూతురే యానిమల్, ఆల్ఫా, అన్నీ.. మా ఇద్దరిదీ ఏమీ నడవదు: ఆలియా భట్ కామెంట్స్

థియేటర్లలో రణబీర్ కపూర్ ‘యానిమల్’ లాగా ఊచకోత కోసినా, తాను ‘ఆల్ఫా’ లాగా ఎంత పవర్‌ఫుల్ రోల్స్ చేసినా.. ఇంట్లో మాత్రం వీళ్లద్దరినీ శాసించే అసలైన బాస్ వేరే ప్రొడక్ట్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

మా ఇంట్లో అసలైన ‘జనరేషన్ ఆల్ఫా’ రాహానే..

యూట్యూబర్ 'మైమిస్ ఆనంద్' (MyMissAnand)తో మాట్లాడిన ఆలియా భట్, తన ముద్దుల కూతురు రాహా కపూర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. యాంకర్ సరదాగా అడుగుతూ.. "బయట రణబీర్ కపూర్ యానిమల్, నువ్వు ఆల్ఫా కదా.. మరి ఇంట్లో ఎవరు బాస్?" అని ప్రశ్నించగా ఆలియా నవ్వుతూ ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చింది.

"మా ఇంట్లో అసలైన యానిమల్, ఆల్ఫా రెండూ మా కూతురు రాహానే.. తనే మా ఇద్దరినీ కంట్రోల్ చేస్తుంది" అంటూ అసలు మ్యాటర్ చెప్పేసింది. మూడేళ్ల రాహా కపూర్ చెప్పినట్లే తామిద్దరం నడుచుకోవాల్సి వస్తోందని నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది.

నైట్ డ్రెస్ వేసుకుంటే ఒప్పుకోదు.. ఆలియా భట్ క్రేజీ సీక్రెట్స్

"జీన్స్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావ్? ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకుని కూర్చోవడానికి వీల్లేదు, నైట్ బట్టలు వేసుకో" అంటూ ఆర్డర్ వేసిందని ఆలియా నవ్వుతూ చెప్పింది. కూతురు చెప్పిన ఆ మాటలకు తను సైలెంట్ అయిపోయి రాహా రూల్స్ ఫాలో అయ్యానని, తను చాలా క్లెవర్ థింకర్ అని ప్రశంసించింది.

చిన్న వయసులోనే సెలబ్రిటీ లక్షణాలు.. పుట్టకతోనే ఫిల్మీ!

ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా ఆలియా భట్ తన కూతురి టాలెంట్ గురించి మాట్లాడింది. రాహా కపూర్ పుట్టుకతోనే ఒక పర్ఫామర్ అని, తనలో ఫుల్ ఫిల్మీ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పింది. మ్యూజిక్ వినడం, డాన్స్ స్టెప్స్ చాలా ఫాస్ట్‌గా క్యాచ్ చేయడం రాహాకు అలవాటని హింట్ ఇచ్చింది.

స్పోర్ట్స్, ఆర్ట్స్‌తో పాటు అన్ని విషయాల్లోనూ రాహా ఒక లీడర్‌లా ఆలోచిస్తుందని ఆలియా గర్వంగా చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 2022లో పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్, కూతురి ప్రైవసీని చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ఉంచి, ఆ తర్వాతే మీడియాకు పరిచయం చేశారు.

'జిగ్రా' తర్వాత భారీ యాక్షన్ ప్లాన్..

చివరిగా 'జిగ్రా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా భట్.. ప్రస్తుతం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో భాగమైన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆల్ఫా' (Alpha) లో నటిస్తోంది. శివ్ రావల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆలియా భట్‌తో పాటు శర్వరి (Sharvari) లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్, హృతిక్ రోషన్ వార్, షారుఖ్ ఖాన్ పఠాన్ లాంటి మెగా స్టార్స్ మాత్రమే రూల్ చేసిన ఈ స్పై యూనివర్స్‌లో వస్తున్న మొదటి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం.

ఈ సినిమాలో ఆలియా భట్ చిన్నప్పటి నుంచి హంతకురాలుగా ట్రైనింగ్ తీసుకున్న 'సీత' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఏజెంట్ శర్వరితో కలిసి సీత చేసే ఓ భారీ మిషన్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్స్ కానున్నాయి. బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్న ఈ సినిమా జులై 3 న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe