Alpha Teaser: బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టావంతంగా రూపొందిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’. అలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 10) నాడు మేకర్స్ విడుదల చేశారు. శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆల్ఫా టీజర్

అలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆల్ఫా టీజర్ ఇవాళ రిలీజైంది. ఇందులో అలియా భట్ తన తన యాక్షన్ తో అదరగొట్టింది. అయితే, ఇది కేవలం ఒక సాధారణ టీజర్ మాత్రమే కాదు. నిశితంగా గమనిస్తే.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో రాబోయే భారీ మలుపులకు ఇది ఒక బలమైన పునాదిగా కనిపిస్తోంది.
తండ్రీకూతుళ్ల బాండింగ్.. ఊహించని ట్విస్ట్!
ఆల్ఫా టీజర్ విషయానికి వస్తే.. మొదట తండ్రీకూతుళ్ల మధ్య ఎంతో సున్నితంగా, ప్రేమగా సాగే ఒక బర్త్‌డే డిన్నర్ డేట్‌లా ఇది కనిపిస్తుంది. కానీ, కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఇందులో అలియా భట్‌కు తండ్రిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఆయన తన కూతురి 18వ పుట్టినరోజున విషెస్ చెప్తూనే, ఒక గది తాళం చెవిని ఆమె చేతిలో పెడతారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది.
ఆల్ఫా సోల్జర్ గా అలియా భట్ తన యాక్షన్ తో అదరగొట్టింది. నెక్ట్స్ జనరేషన్ సోల్జర్స్ ను రెడీ చేసేందుకు ఏర్పాటు చేసిందే ఆల్ఫా అని బాబీ డియోల్ చెప్తాడు.
క్యూరియాసిటీ
సాధారణంగా స్పై సినిమాల్లో హీరోలు దేశం కోసం ఏజెంట్లుగా మారతారు. కానీ ఇక్కడ ఒక తండ్రే తన కూతురిని చిన్నతనం నుండి ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌గా, ‘ఆల్ఫా’ సంస్థకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ సోల్జర్‌గా మార్చడం కథపై క్యూరియాసిటీని పెంచుతోంది.
'వార్ 2' ఎండింగ్ సీక్రెట్ కనెక్షన్
{{/usCountry}}సాధారణంగా స్పై సినిమాల్లో హీరోలు దేశం కోసం ఏజెంట్లుగా మారతారు. కానీ ఇక్కడ ఒక తండ్రే తన కూతురిని చిన్నతనం నుండి ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌గా, ‘ఆల్ఫా’ సంస్థకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ సోల్జర్‌గా మార్చడం కథపై క్యూరియాసిటీని పెంచుతోంది.
'వార్ 2' ఎండింగ్ సీక్రెట్ కనెక్షన్
{{/usCountry}}ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ ‘ఆల్ఫా’ కథకు గతేడాది వచ్చిన 'వార్ 2' (War 2) ముగింపుతో బలమైన లింక్ ఉంది. 'వార్ 2' క్లైమాక్స్ సీన్లలో బాబీ డియోల్ ఒక చిన్నారికి కఠినమైన శిక్షణ ఇస్తున్నట్లు చూపించారు. ఆ చిన్నారే ఇప్పుడు 18 ఏళ్ల వయసులో అలియా భట్‌గా మనకు టీజర్‌లో పరిచయమైంది. అంటే, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ టైమ్‌లైన్‌లో ఈ చిత్రం ఒక కీలకమైన ‘ఆరిజిన్ స్టోరీ’ కాబోతోంది.
వర్కవుట్ అవుతుందా?
ఆల్ఫా సినిమాలో నటించడంపై గతంలో అలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మన భారతీయ చిత్రసీమలో హీరోల ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మహిళా యాక్షన్ పాత్రలు (ఉదాహరణకు ‘టైగర్’ సిరీస్‌లో కత్రినా కైఫ్) ఉన్నప్పటికీ, ఒక మహిళా పాత్రే లీడ్ రోల్ పోషిస్తూ కమర్షియల్‌గా సక్సెస్ సాధించిన ప్యూర్ యాక్షన్ కథలు చాలా అరుదు. ఆ లోటును 'ఆల్ఫా' భర్తీ చేస్తుందని అలియా గట్టి నమ్మకంతో ఉంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
People Also Aks (తరచుగా అడిగే ప్రశ్నలు)
ప్రశ్న: ఆల్ఫా సినిమాలో బాబీ డియోల్ రోల్ ఏంటి?
జవాబు: ఈ సినిమాలో బాబీ డియోల్ అలియా భట్‌కు తండ్రిగా నటిస్తున్నారు. అలాగే ఆమెకు చిన్నతనం నుంచి స్పై శిక్షణ ఇచ్చే ఒక కఠినమైన గురువు పాత్రలో ఆయన కనిపిస్తారు.
ప్రశ్న: ఆల్ఫా మూవీ రిలీజ్ ఎప్పుడు?
జవాబు: అలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రశ్న: ఈ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగమేనా?
జవాబు: అవును.. ఇది ఏక్ థా టైగర్, పఠాన్, వార్, వార్ 2 చిత్రాల తరహాలోనే యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అధికారిక స్పై యూనివర్స్‌లో భాగం.