Mahesh Bhatt: 'రామాయణం' (Ramayana) మూవీకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే శ్రీరాముడి పాత్రలో కనిపించిన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు తన సొంత కుటుంబం నుంచి లభించిన అభినందనలు అత్యంత ప్రత్యేకమైనవిగా నిలిచాయి. రణబీర్ మామ, ప్రముఖ దర్శక-నిర్మాత మహేష్ భట్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన ఎమోషన్స్ ను పంచుకుంటూ అల్లుడి నటనను ఆకాశానికెత్తేశారు.
“కన్నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నించా.. కానీ సాధ్యపడలేదు”

ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ భట్ మాట్లాడారు. "ఇంటర్వెల్ కంటే ముందు శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరే సన్నివేశం రాగానే నా గొంతు ఎండిపోయింది. కన్నీళ్లు ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను. నా చుట్టూ ఉన్న యంగ్ ఫిల్మ్‌మేకర్స్, రచయితలకు నేను రణబీర్ మామగారిననే విషయం తెలుసు. లైట్లు వేయగానే నా కళ్లలోని నీళ్లను దాచడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. అద్భుతమైన అనుభవాలు మనల్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి" అని తెలిపారు.
రాముడిలో దైవత్వాన్ని స్పృశించాడు.. యశ్ రావణుడిగా మెప్పించాడు
దర్శకుడు నితేష్ తివారీ శ్రీరాముడు, రావణాసురుడి పాత్రలను ఎంతో సున్నితంగా, పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారని మహేష్ భట్ ప్రశంసించారు. లంకేశ్వరుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ నటన తనను మంత్రముగ్ధుడిని చేసిందని, ఆయనకున్న మాస్ ఇమేజ్‌ను దర్శకుడు నితేష్ చాలా పద్ధతిగా, బ్యాలెన్స్‌డ్‌గా నియంత్రించారని అభిప్రాయపడ్డారు.
ఇక రణబీర్ స్క్రీన్ పైకి వచ్చి చేతులు జోడించి నమస్కరించిన క్షణంలో.. అతను తనలోని దైవత్వాన్ని స్పృశించినట్లు అనిపించిందని, ఇప్పటివరకు అతని కెరీర్‌లో ఏ సినిమా కూడా బయటకు తీయని ఒక గొప్ప నటుడిని ఇందులో చూశానని మహేష్ భట్ అన్నారు.
రామాయణం సెట్స్‌లో చిన్నారి రాహా.. అలియా భట్ ఎమోషనల్ పోస్ట్
మరోవైపు రణబీర్ భార్య, నటి అలియా భట్ తమ కుమార్తె రాహాతో కలిసి 'రామాయణం' సెట్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రణబీర్ కష్టాన్ని ప్రశంసిస్తూ.. "ఈ సినిమా కోసం నువ్వు నీ సర్వస్వాన్ని ధారపోశావు. అంతటి కష్టపడే తత్వంలోనూ చిన్నారి రాహా కోసం సమయాన్ని కేటాయించడం నీకే సాధ్యమైంది. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కొన్ని కథలు మనందరికంటే చాలా పెద్దవి.. అందులో రామాయణం ఒకటి" అని ఆమె క్యాప్షన్ జోడించారు.
{{/usCountry}}మరోవైపు రణబీర్ భార్య, నటి అలియా భట్ తమ కుమార్తె రాహాతో కలిసి 'రామాయణం' సెట్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రణబీర్ కష్టాన్ని ప్రశంసిస్తూ.. "ఈ సినిమా కోసం నువ్వు నీ సర్వస్వాన్ని ధారపోశావు. అంతటి కష్టపడే తత్వంలోనూ చిన్నారి రాహా కోసం సమయాన్ని కేటాయించడం నీకే సాధ్యమైంది. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కొన్ని కథలు మనందరికంటే చాలా పెద్దవి.. అందులో రామాయణం ఒకటి" అని ఆమె క్యాప్షన్ జోడించారు.
{{/usCountry}}