Ramba Oorvasi Menaka: అల్లరి నరేష్ సినిమాకు షాక్.. హీరోయిన్ల దుస్తులపై సెన్సార్ ఫైర్.. టైమ్ కు రిలీజ్ కష్టమేనా!

Ramba Oorvasi Menaka Censor: అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' చిత్రానికి సెన్సార్ షాక్ తగిలినట్లు తెలిసింది. సినిమాలోని దేవకన్యల గ్లామర్ దుస్తులపై బోర్డు అభ్యంతరం చెప్పడంతో సెప్టెంబర్ 4న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.

Published on: Aug 30, 2026, 18:24:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramba Oorvasi Menaka Censor: కమెడియన్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా సోషియో-ఫాంటసీ కామిడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka). ఈ మూవీ విడుదలపై హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. 2026 సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అల్లరి నరేష్ సినిమాకు షాక్.. హీరోయిన్ల దుస్తులపై సెన్సార్ ఫైర్.. టైమ్ కు రిలీజ్ కష్టమేనా!
అల్లరి నరేష్ సినిమాకు షాక్.. హీరోయిన్ల దుస్తులపై సెన్సార్ ఫైర్.. టైమ్ కు రిలీజ్ కష్టమేనా!

అయితే, సరిగ్గా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఈ రంభ ఊర్వశి మేనక చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఊహించని షాక్ తగిలినట్లు తెలిసింది.

సెన్సార్ బోర్డు షాక్

రంభ ఊర్వశి మేనక సినిమాకు సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలో దేవలోకం నుంచి భూమిపైకి వచ్చే అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకల గ్లామరస్ దుస్తులపై సెన్సార్ బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. ఆ సన్నివేశాల్లో వారి దుస్తులు మితిమీరిన రీతిలో అసభ్యకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు ఫీల్ అయిందని సమాచారం.

రిలీజ్ కష్టమేనా?

రంభ, ఊర్వశి, మేనక గ్లామర్ దుస్తుల ప్లేస్ లో మరింత సంప్రదాయబద్ధమైన చీరకట్టులో ఆ పాత్రలను చూపించాలని బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. సెన్సార్ పర్మిషన్ లభించాలంటే ఆయా సన్నివేశాల్లో మార్పులు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 4న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

దేవలోకం నుంచి భూమికి అప్సరసలు!

చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందిన ఈ రంభ ఊర్వశి మేనక చిత్రం ఒక విచిత్రమైన సోషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు ఒక మాయా పుస్తకం సహాయంతో స్వర్గలోకంలోని దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదికి రప్పించడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు నిరంతరం ప్రయత్నాలు చేస్తాడు.

ఈ క్రమంలో వారి రాకను అడ్డుకోవడానికి దేవేంద్రుడు చేసే ప్రయత్నాలు, చివరికి ఆ దేవకన్యలు భూమిపైకి అడుగుపెట్టిన తర్వాత చోటుచేసుకునే వినోదాత్మక పరిణామాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో ఊర్వశిగా విష్ణుప్రియ, రంభగా రాశీ సింగ్, మేనకగా ప్రియా సింగ్ నటించారు.

సినిమాలో ఇలా

'దసరా', 'సామజవరగమన' వంటి హిట్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల సంయుక్తంగా ఈ రంభ ఊర్వశి మేనక చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ సరసన సురభి పురాణిక్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేశాడు. సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల కారణంగా విడుదల తేదీపై నిర్మాతలు త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More