Raaka Guinness Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా రిలీజ్‌కు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ టీమ్ హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగంతో ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
రివీల్ అయిన '37' మిస్టరీ.. మోషన్ క్యాప్చర్‌లో గిన్నిస్ రికార్డ్

డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ను మేకర్స్ రివీల్ చేశారు. కొద్దిరోజుల క్రితం '37' నంబర్‌తో ఒక సస్పెన్స్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీ పెంచారు. ఇప్పుడు ఆ 37 సీక్రెట్ ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.
ఒకేసారి 37 మంది నటీనటులను రియల్ టైమ్‌లో 'మోషన్ క్యాప్చర్' (Motion Capture) టెక్నాలజీతో షూట్ చేసి రాకా టీమ్ ఈ అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఈ రికార్డు కేవలం 19 మందిని ఒకేసారి క్యాప్చర్ చేయడంతో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును రాకా సినిమా డబుల్ మార్జిన్‌తో బ్రేక్ చేసింది.
పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై కన్నేసిన సన్ పిక్చర్స్
ఈ అద్భుతమైన ఫీట్‌కు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీలకు అఫీషియల్ సర్టిఫికెట్ అందజేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ పరంగా ఇదొక పెద్ద మైలురాయి అని చెప్పాలి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో గ్లోబల్ స్టార్ దీపికా పదుకోన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తుండటం ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
బన్నీ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్ ఖాయం
{{/usCountry}}సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో గ్లోబల్ స్టార్ దీపికా పదుకోన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తుండటం ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
బన్నీ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్ ఖాయం
{{/usCountry}}పుష్ప సిరీస్‌తో గ్లోబల్ వైడ్ ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆడియన్స్‌కు ఒక అన్‌రియల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. భారీ తారాగణం, వరల్డ్ క్లాస్ విజువల్స్, అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో వస్తున్న 'రాకా' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ మూవీపై ఉన్న అంచనాలను పెంచేస్తూ ఈ మధ్యే తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి.. రాకాలోని విజువల్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇందులోని విజువల్స్ తాను అవతార్ మూవీలోనూ చూడలేదని, మూడు రోజుల్లో మీరే చూస్తారంటూ ఓ హైప్ క్రియేట్ చేశారు. అయితే అది ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డే అని తాజాగా తేలింది.