Allu Arjun Raaka: ‘రాకా’ రేంజ్ విజువల్స్ అవతార్‌లోనూ లేవు.. మూడు రోజుల్లో మీరూ చూస్తారు: తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకా మూవీని ఆకాశానికెత్తాడు తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి. అంతేకాదు ఈ సినిమా నుంచి మరో మూడు రోజుల్లోనే అప్డేట్ రాబోతోందని హింట్ కూడా ఇవ్వడం ఫ్యాన్స్ ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా' (Raaka) మూవీపై కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఊహించని రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్' ను మించిపోతాయని, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయమని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి సంచలన కామెంట్స్ చేశారు.

"అవతార్‌లోనే లేని విజువల్స్ రాకాలో చూశాను"
ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న 'డాన్' మూవీ ఫేమ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి.. రాకా సినిమా గురించి మైండ్ బ్లాకింగ్ విషయాలను పంచుకున్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా గర్వపడేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"అట్లీ సర్ నాకు రాకా సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్ ఫుటేజెస్ చూపించారు. నిజం చెప్తున్నాను, హాలీవుడ్ మూవీ అవతార్ లో కూడా నేను అలాంటి విజువల్స్ చూడలేదు. మరో మూడు రోజుల్లో మీరూ చూస్తారు.. ఎస్‌ఎస్ రాజమౌళి సర్ ఇండియన్ సినిమాను ఏ రకంగా గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టారో, అట్లీ సర్ కూడా రాకా సినిమాతో మన సినిమాను వరల్డ్ మ్యాప్‌పై నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు" అని కొనియాడారు.
3 రోజుల్లో కళ్లు చెదిరే బిగ్ అప్‌డేట్
ఈ రాకా సినిమా నుంచి త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ రాబోతుందంటూ సిబి చక్రవర్తి ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పారు. "మరో 3 రోజుల్లో మీరందరూ ఈ సినిమా గ్రాండియర్ ఏంటో సొంతంగా చూడబోతున్నారు, అట్లీకి స్టూడెంట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పడం చూస్తుంటే ఏ అప్డేట్ రాబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.
దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రమోషనల్ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్ మరో 3 రోజుల్లో లాంచ్ కావడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌పై ఐకాన్ స్టార్ కన్ను
'పుష్ప 1', 'పుష్ప 2' సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన అల్లు అర్జున్, ఇప్పుడు 'రాకా' సినిమాతో గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అల్లు అర్జున్ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.
ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ విజువల్ టేకింగ్ తో పాటు బాలీవుడ్ గ్లామర్ కలవడంతో బిజినెస్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
అట్లీ మేకింగ్.. సన్ పిక్చర్స్ అన్‌లిమిటెడ్ బడ్జెట్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తీసి ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అట్లీ.. ఈసారి అంతకుమించిన భారీ ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా నిర్మిస్తోంది.
ఇక ఈ సినిమాకు ట్రెండింగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అగ్ర శ్రేణి వీఎఫ్‌ఎక్స్ (VFX) సంస్థలు ఈ ప్రాజెక్ట్ గ్రాఫిక్స్ పనుల్లో భాగమయ్యాయి. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టకిల్ గా రాబోతున్న 'రాకా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


