Raaka: అల్లు అర్జున్ రాకా మూవీలో హాలీవుడ్ స్టార్ హీరో.. రూ.700 కోట్ల సినిమాలో అతడే విలన్ అంటూ..!
Will Smith in Raaka: అల్లు అర్జున్, అట్లీ రాకా మూవీలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అంతేకాదు అతడే ఈ సినిమాలో ప్రధాన విలన్ అని కూడా అంటుండటం విశేషం.
Will Smith in Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ నుంచి ఇండియా మొత్తాన్ని షేక్ చేసే అప్‌డేట్ బయటికొచ్చింది. ఏకంగా హాలీవుడ్ సూపర్‌స్టార్, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించబోతున్నారనే వార్త ఇంటర్నేషనల్ వైడ్‌గా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
విల్ స్మిత్ ఎంట్రీ.. విలన్ రోల్‌లో హాలీవుడ్ స్టార్!
మిడ్-డే రిపోర్ట్స్ ప్రకారం.. విల్ స్మిత్‌తో 'రాకా' టీమ్ గత ఏడాది కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం ఆయనను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం విల్ స్మిత్ డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో డైరెక్టర్ అట్లీ టీమ్ ఉంది. సెప్టెంబర్ తర్వాత విదేశాల్లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కానున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కూడా పూర్తయినట్లు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
షారుఖ్ ఖాన్ కేమియో.. రికార్డ్ బ్రేకింగ్ లైనప్!
ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో ‘జవాన్’తో అట్లీ వేయి కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కింగ్' చివరి సాంగ్ షూట్‌లో ఉన్న ఎస్‌ఆర్‌కే.. సెప్టెంబర్ తర్వాత 'రాకా' సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
దీపికా ప్రెగ్నెన్సీ, రష్మిక ఇంజ్యూరీ.. హీరోయిన్ల కష్టాలు
‘రాకా’ సినిమాలో కాస్టింగ్ పరంగా అట్లీ ఏమాత్రం తగ్గడం లేదు. దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ప్రస్తుతం దీపికా పదుకోన్ 8 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మెటర్నిటీ బ్రేక్ తీసుకునే లోపే తన హెవీ సీన్లు, యాక్షన్ సీక్వెన్సెస్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు రష్మిక మందన్నా నడుము గాయం (హిప్ ఇంజ్యూరీ) కారణంతో కొద్దిరోజులు బెడ్ రెస్ట్ తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న వెంటనే ఆమె మళ్ళీ 'రాకా' సెట్స్‌లో జాయిన్ కానున్నారు.
రూ.700 కోట్ల బడ్జెట్.. సన్ పిక్చర్స్ బిగ్ ప్లాన్!
అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ 'రాకా'ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రాబోతోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఏకంగా 700 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాబోతున్న 'రాకా', గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


