Allu Arjun: సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘రాకా’తో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తో ఐకాన్ స్టార్ బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ క్రేజీ బజ్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ కొత్త ఇల్లు

అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టిస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ లో తన మామయ్య చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ కొత్త బంగ్లా నిర్మిస్తున్నారని తెలిసింది. రాజసం ఉట్టిపడేలా ఈ ఇంటికి అల్లు అర్జున్ ఎంతో ఇష్టంతో కట్టించుకుంటున్నారని టాక్. పైగా చిరంజీవి ఇంటికి సమీపంలోనే ఈ ఇల్లు నిర్మాణం జరుగుతుందనే విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
రేటు ఎంతంటే?
అల్లు అర్జున్ కొత్త ఇల్లు రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. 4 వేల స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో ఈ ఇల్లును నిర్మిస్తున్నారని తెలిసింది. దీని కోసం ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. భారీ డబ్బుతో విలాసవంతమైన బంగ్లాను తన కోసం అల్లు అర్జున్ కట్టించుకుంటున్నాడని టాక్.
రాకా గురించి
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న మూవీ ‘రాకా’. ఇదో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
రాకా మూవీలో అల్లు అర్జున్ మూడు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇందులో ఒకటేమో పోలీస్ క్యారెక్టర్ అని తెలిసిందే. మరొకటి సగం జంతువు, సగం మనిషిగా ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో కనిపించిన క్యారెక్టర్ అదే అని టాక్.
పుష్ప సినిమాలతో
{{/usCountry}}రాకా మూవీలో అల్లు అర్జున్ మూడు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇందులో ఒకటేమో పోలీస్ క్యారెక్టర్ అని తెలిసిందే. మరొకటి సగం జంతువు, సగం మనిషిగా ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో కనిపించిన క్యారెక్టర్ అదే అని టాక్.
పుష్ప సినిమాలతో
{{/usCountry}}పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో అల్లు అర్జున్ దశ తిరిగిపోయింది. ముఖ్యంగా పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సక్సెస్ తో అల్లు అర్జున్ స్టార్ డమ్ ఆకాశాన్ని తాకేసింది. దీంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న రాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.