...
...
Next Story

చిరంజీవి, చిట్టిక ముఖాలు వెలిగిపోతున్నాయి.. కవలలకు తండ్రయిన రామ్ చరణ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

కవలలకు తండ్రి అయిన రామ్ చరణ్ కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చిరంజీవి, చిట్టిక (క్లిన్ కారా) ముఖాలు వెలిగిపోతున్నాయని అతడు అనడం విశేషం. అతడు ఇంకా ఏమన్నాడో చూడండి.

Published on: Feb 2, 2026, 15:22:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆదివారం (ఫిబ్రవరి 1) కవల పిల్లలు జన్మించిన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ సోమవారం (ఫిబ్రవరి 2) ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు చరణ్ మొదటి కూతురు క్లిన్ కారాను చిట్టిక అని పిలవడం విశేషం.

చరణ్‌కు బన్నీ విషెస్

చిరంజీవి, చిట్టిక ముఖాలు వెలిగిపోతున్నాయి.. కవలలకు తండ్రయిన రామ్ చరణ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు
చిరంజీవి, చిట్టిక ముఖాలు వెలిగిపోతున్నాయి.. కవలలకు తండ్రయిన రామ్ చరణ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

రామ్ చరణ్, ఉపాసన మరోసారి పేరెంట్స్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. “మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల గారికి హృదయపూర్వక అభినందనలు. అంతటా ఎంతో సంతోషం, సంబరాలు నెలకొన్నాయి. చిరంజీవి గారు, చిట్టికల ముఖాల్లో ఆ గర్వం, ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారందరినీ, అలాగే మెగా ఫ్యామిలీ చిరునవ్వులను చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్నారుల రాకతో లోకంలో ఎంతో వెలుగు నిండింది. ఈ అందమైన కొత్త ఆరంభానికి రెట్టింపు ప్రేమ, రెట్టింపు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను” అని బన్నీ ట్వీట్ చేశాడు.

చరణ్, ఉపాసనకు కవలలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సారి తండ్రయిన విషయం తెలుసు కదా. ఈసారి అతని హ్యాపీనెస్ డబుల్ అయింది. ఎందుకంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఒక పాప, ఒక బాబు పుట్టడం విశేషం. ఈ విషయాన్ని మొదట మెగాస్టార్ చిరంజీవి కన్ఫామ్ చేశాడు. ఇప్పుడు ట్విన్స్ కు తండ్రిగా రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ వైరల్ గా మారింది. చరణ్ ఇన్ స్టాలో ఉపాసన గర్భంతో ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోతో తన రియాక్షన్ పోస్టు చేశాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe