కవల పిల్లలకు తండ్రిగా.. రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వాళ్లే మన బలమంటూ పోస్ట్
మెగా ఇంట ఆనందం నెలకొంది. మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. ట్విన్స్ కు తండ్రి అయిన తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ వైరల్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సారి తండ్రయ్యారు. ఈ సారి అతని హ్యాపీనెస్ డబుల్ అయింది. ఎందుకంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు పుట్టారు. ఈ విషయాన్ని మొదట మెగాస్టార్ చిరంజీవి కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ట్విన్స్ కు తండ్రిగా రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ వైరల్ గా మారింది.

రామ్ చరణ్ రియాక్షన్
రామ్ చరణ్, ఉపాసన దంపుతులకు కవలలు పుట్టారు. ఒక బాబు, ఒక పాప వీళ్ల జీవితాల్లోకి వచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రౌడ్ తాతయ్య చిరంజీవి అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ ఇన్ స్టాలో ఉపాసన కడుపుతో ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోతో తన రియాక్షన్ పోస్టు చేశారు.
వాళ్లే బలం
‘‘మాకు ఆశీర్వాదంగా బేబీ బాయ్, గర్ల్ వచ్చారని చెప్పేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకును కలిగి ఉండటం మమ్మల్ని కృతజ్ఞతాభావంతో నింపేస్తుంది. మన జీవితంలోని మహిళలే మన గొప్ప బలం. ప్రతి క్షణంలోనూ మాకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన మా అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అని ఇన్ స్టాలో ఆదివారం (ఫిబ్రవరి 1) రామ్ చరణ్ పోస్టు చేశారు.
రామ్ చరణ్, ఉపాసన గురించి
2012 జూన్ లో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన. 2023 జూన్ లో ఈ జంటకు క్లీంకారా అనే అమ్మాయి జన్మించింది. ఇప్పుడు ట్విన్స్ వీళ్ల జీవితాల్లోకి వచ్చారు. 2025 దీపావళి సందర్భంగా ఉపాసన తన సీమంతం (బేబీ షవర్) వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది అప్పుడు వైరల్ గా మారింది.
పెద్ది సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్టర్. అతను ఉప్పెన సినిమాతో డెబ్యూ చేశారు. పెద్ది మూవీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. 2026 సమ్మర్ లో పెద్ది సినిమా రిలీజ్ కానుంది. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


