Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా హేటర్స్, ఆన్‌లైన్ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ శౌర్య భవన్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ.. "ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. వదిలేయండి" అంటూ అభిమానులకు పవర్ ఫుల్ సందేశం ఇచ్చారు. బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.
బన్నీ నేర్పిన జీవిత పాఠం

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం జరిగే ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ కల్చర్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జీవితాన్ని రోజువారీ 100 శాతం బ్యాటరీతో పోల్చిన అల్లు అర్జున్.. ఆ ఎనర్జీని ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
"ఒక మనిషి లేదా ఒక విషయం నచ్చకపోతే దాని వెనుక పడి ద్వేషించడం, ట్రోల్స్ చేయడం దండగ. ఆ నెగెటివిటీ కోసం మీ వద్ద ఉన్న 100 శాతం ఎనర్జీలో ఒక్క శాతం కూడా వృథా చేయకూడదు" అని అల్లు అర్జున్ హితవు పలికారు. మీ లక్ష్యాలు, కుటుంబం, మీ కెరీర్, మీకు ఆనందాన్ని ఇచ్చే పనుల పైన మాత్రమే దృష్టి పెట్టాలని ఫ్యాన్స్‌కు సూచించారు.
మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిల్చొన్నా సరే.. కనీసం మీకైనా ఆనందం దక్కుతుంది కదా అని బన్నీ అనడంతో ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున అరిచారు.
షూ విప్పి.. దేవుడి విగ్రహం తీసుకొని..
ఇదే ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన మరో పని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని ఆయనకు పూరి జగన్నాథ విగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దీంతో బన్నీ తన షూస్ విప్పి ఆ విగ్రహాన్ని అందుకున్నారు. ఇది ఆయన భక్తికి నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'రాకా' మూవీ మానియా.. అట్లీ మార్క్ విజువల్ వండర్
ఫ్యాన్స్ మీట్లో మాట్లాడిన బన్నీ వ్యాఖ్యలతో పాటు ఆయన నెక్స్ట్ రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ 'రాకా' (Raaka) హ్యాష్‌ట్యాగ్ కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో అర్జున్.. తన ఐకానిక్ రాకా పోజు ఇవ్వడం విశేషం.
{{/usCountry}}ఫ్యాన్స్ మీట్లో మాట్లాడిన బన్నీ వ్యాఖ్యలతో పాటు ఆయన నెక్స్ట్ రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ 'రాకా' (Raaka) హ్యాష్‌ట్యాగ్ కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో అర్జున్.. తన ఐకానిక్ రాకా పోజు ఇవ్వడం విశేషం.
{{/usCountry}}'పుష్ప 2' నెక్స్ట్ లెవెల్ గ్లోబల్ సక్సెస్ తర్వాత బన్నీ నుంచి రాబోతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మార్క్ గ్రాండియర్, పవర్‌ఫుల్ విజువల్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండబోతున్నాయని టాక్.
లోకేష్ కనగరాజ్‌తో 'AA23'.. అనిరుధ్ మ్యూజిక్
'రాకా' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్న అల్లు అర్జున్, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో 'AA23' ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పక్కా రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ రెండు బిగ్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ దగ్గర బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'కీప్ ది ఫైర్ ఆన్'.. ఫ్యాన్స్ హర్షం
హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అభిమానులను ఉద్దేశించి "మీరంతా నా హృదయంలో ఉన్నారు.. కీప్ ది ఫైర్ ఆన్" అంటూ బన్నీ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ కామెంట్స్ కేవలం ట్రోలర్స్‌కు క్లాస్ పీకడం మాత్రమే కాదని, జీవితంలో సొంత లక్ష్య సాధన కోసం ముందుకెళ్లేందుకు బన్నీ ఇచ్చిన గొప్ప లైఫ్ మెసేజ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.