...
...
Next Story

చుట్టుముట్టిన ఫ్యాన్స్‌-భార్య చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకున్న అల్లు అర్జున్‌-ఐకాన్ స్టార్‌కు షాకింగ్ అనుభ‌వం

హైదరాబాద్‌లోని కేఫ్ నీలోఫర్ వద్ద అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిలను అభిమానులు చుట్టుముట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ ఎగబడటంతో భార్య చేతిని గట్టిగా పట్టుకుని ఐకాన్ స్టార్ బయటపడ్డాడు. ఈ షాకింగ్ అనుభవం వీడియో వైరల్ గా మారింది.

Published on: Jan 4, 2026, 16:07:39 IST
Advertisement

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బయటకు వెళ్లడమే గగనంగా మారింది. హీరో లేదా హీరోయిన్ పబ్లిక్ లో కనిపిస్తే జనాలు ఎగబడిపోతున్నారు. చుట్టుముట్టి, మీద పడిపోతూ తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ కేఫ్ లోకి తన భార్యతో వెళ్లిన అల్లు అర్జున్ అతి కష్టం మీద బయట పడ్డాడు.

భార్యతో అల్లు అర్జున్

ఫ్యాన్స్ మధ్యలో అల్లు అర్జున్, స్నేహా
ఫ్యాన్స్ మధ్యలో అల్లు అర్జున్, స్నేహా

శనివారం (జనవరి 3) రాత్రి హైదరాబాద్‌లోని కేఫ్ నీలోఫర్ వద్ద అభిమానులు అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డిలను చుట్టుముట్టడం కలకలం రేపింది. నగరంలో అల్లు సినిమాస్ ప్రారంభించిన తర్వాత దంపతులు ఈ కేఫ్‌కు వచ్చారు. వెంటనే ఫ్యాన్స్ వాళ్లను గుర్తుపట్టారు. సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు వారి చుట్టూ గుమిగూడారు.

చేయి పట్టుకుని

ఫ్యాన్స్ ఎగబడటంతో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి చేతిని గట్టిగా పట్టుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది. సెక్యూరిటీ జనాలను అదుపు చేయలేకపోయారు. గట్టిగా తోసేశారు. ఆ రద్దీని దాటుకుని అల్లు అర్జున్, స్నేహారెడ్డి బయటపడ్డారు.

ఒక వీడియోలో అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది గుంపును నియంత్రించడానికి ప్రయత్నిస్తుండగా, వారు కేఫ్ లోపల ఎలా చిక్కుకున్నారో కనిపించింది. కేఫ్ సిబ్బంది తలుపులు తెరిచి ఉంచగా, ఆందోళనగా ఉన్న అర్జున్ స్నేహాను చేతితో దగ్గరగా పట్టుకుని, గుంపులోంచి బయటపడటానికి కష్టపడుతున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

కష్టంగా కార్లోకి

అల్లు సినిమాస్

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో తన కొత్త థియేటర్ అల్లు సినిమాస్ కోసం అర్జున్ ఒక సాఫ్ట్ లాంచ్ నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో తన కుమారుడు అయాన్ తో కలిసి అల్లు అర్జున్ ఫొటోలకు పోజులిచ్చాడు. కోకాపేటలోని ఈ థియేటర్ డాల్బీ సినిమా ఫార్మాట్‌కు మద్దతు ఇస్తుంది. సంక్రాంతికి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

ఐకానిక్ స్పాట్

నిర్మాత ఎస్కేఎన్ ఈ సాఫ్ట్ లాంచ్‌కు హాజరయ్యారు. తన సోషల్ మీడియాలో.. "అల్లు సినిమాస్ టెక్ చెక్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇది హైదరాబాద్‌లోని తదుపరి ఐకానిక్ స్పాట్ కానుంది. అద్భుతమైన చిత్ర నాణ్యత. సౌండ్ టాప్ నాచ్. ఇది ఆసియా నంబర్ 1. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డాల్బీ సినిమా అని తెలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. థియేటర్ లోపల గోడలకు అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్, మామ చిరంజీవి చిత్రాలు హైలైట్ గా నిలిచాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks