Allu Arjun: నేషనల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏ హీరోకైనా బాలీవుడ్ నుంచి పిలుపు రావడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ విషయంలోనూ గత కొద్దిరోజులుగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఇకపై ముంబైలోనే సెటిల్ కాబోతున్నారన్నది ఆ ప్రచారం సారాంశం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అలాంటిదేమీ లేదన్న అల్లు అరవిండ్

అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా.. అన్న ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. "బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం లేదా ఇతర పనుల మీద ఎక్కువగా ముంబై వెళ్లడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. అయితే పూర్తిగా హైదరాబాద్ వదిలేసి ముంబైకి వెళ్లిపోతారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అర్జున్ మనసు ఎప్పుడూ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. అతనికి స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి ముంబై ఎందుకు వెళ్తాడు" అని అల్లు అరవింద్ అన్నాడు. అయితే అల్లు అర్జున్ ముంబైలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడట. తరచూ ముంబై వెళ్లడం వల్ల అక్కడ ఉండటానికి వీలుగా తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముంబై మకాం వెనుక అసలు కారణం ఇదేనా?
సాధారణంగా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేసినప్పుడు ముంబైలో ఆఫీసులను లేదా నివాసాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా అక్కడ ప్రాపర్టీలు కొన్న సందర్భాలు ఉన్నాయి.
బన్నీకి ప్రస్తుతం నార్త్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమా తీస్తున్న నేపథ్యంలో.. కథా చర్చల కోసం ముంబై వెళ్లడం బన్నీకి కామన్ గా మారింది. అంతేకాదు రాబోయే రాకా మూవీ కోసం కూడా ఎక్కువగా ముంబైలోనే ఉండాల్సి రానుంది. అందుకే ఈ ప్రచారం ఊపందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారా?
{{/usCountry}}1. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారా?
{{/usCountry}}లేదు.. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొనలేదు. కానీ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.
2. బన్నీ ఇకపై బాలీవుడ్ సినిమాలే చేస్తారా?
లేదు. బన్నీ ప్రధానంగా టాలీవుడ్ హీరో అయినప్పటికీ, ఆయన చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలు. కాబట్టి హిందీ ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి.
3. అల్లు అర్జున్ రాకా మూవీ విశేషాలు ఏంటి?
అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న రాకా మూవీలో దీపికా పదుకోన్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఈ మధ్యే వచ్చిన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.