...
...
Next Story

Allu Arjun Nampally Court: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్.. వర్చువల్ కాదు.. కోర్టుకు రావాల్సిందే!

Allu Arjun Nampally Court: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) విచారణకు హాజరవుతానన్న అతని పిటిషిన్ కు కొట్టేసింది. కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

Published on: Jun 20, 2026, 13:20:50 IST
Advertisement

Allu Arjun Nampally Court: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు మరో షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇప్పుడు ట్రేడ్, పబ్లిక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావల్సిందేనని, అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.

అల్లు అర్జున్ కు షాక్

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్.. వర్చువల్ కాదు.. కోర్టుకు రావాల్సిందే!
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్.. వర్చువల్ కాదు.. కోర్టుకు రావాల్సిందే!

నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముంబైలో తన కొత్త ప్రాజెక్ట్ రాకా మూవీ షూటింగ్ షెడ్యూల్స్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని న్యాయస్థానం కొట్టిపారేసింది. "షూటింగ్ సాకులు చట్టం ముందు కుదరవు" అని స్పష్టం చేస్తూ సోమవారం కోర్టుకు స్వయంగా రావాలని ఆదేశించింది.

అసలు ఏం జరిగింది?

డిసెంబర్ 2024 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో ప్రత్యేక ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు అల్లు అర్జున్ స్వయంగా వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా థియేటర్ ప్రాంగణాన్ని ముట్టడించారు.

ఆ సమయంలో సరైన క్రౌడ్ మేనేజ్ మెంట్, ముందస్తు రక్షణ చర్యలు లేకపోవడంతో అక్కడ ఘోరమైన తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ప్రమాదంలో రేవతి అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై నెలల తరబడి ఐసీయూలో మరణంతో పోరాడాల్సి వచ్చింది.

చార్జ్‌షీట్‌లో ఏ-11గా ఐకాన్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం.. అల్లు అర్జున్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కడం అనేది కేవలం ఒక లీగల్ ఇష్యూ మాత్రమే కాదు, దీని వెనుక భారీ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ను హఠాత్తుగా ఆపి, హైదరాబాద్‌కు ప్రయాణమవ్వడం వల్ల ప్రొడక్షన్ హౌస్‌కు రోజుకు లక్షల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని టాక్.

ఇదో ఉదాహరణ

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, ఒక ఘోర ప్రమాదం లేదా ప్రాణనష్టం జరిగిన కేసులో అధికారిక విచారణ ప్రారంభం కావడానికి ముందు, నిందితులు న్యాయమూర్తి ఎదుట ప్రత్యక్షంగా హాజరవడం చట్టపరమైన నిబంధన. అందుకే అల్లు అర్జున్ లీగల్ టీమ్ ఎంత ప్రయత్నించినప్పటికీ, బాధితుల వైపు ఉన్న సెన్సిటివిటీని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి నిరాకరించింది. సెలబ్రిటీల పబ్లిక్ ఈవెంట్స్ వల్ల జరిగే ప్రమాదాలకు నటుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పడానికి ఈ కేసు ఒక పెద్ద ఉదాహరణగా నిలవబోతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks