Drishyam 3 Telugu OTT Stay: షాకింగ్.. దృశ్యం 3 తెలుగు ఓటీటీ రిలీజ్ లేనట్లే.. రేపే స్ట్రీమింగ్ అనగా కోర్టు స్టే.. ఏమైంది?

Drishyam 3 Telugu OTT Stay: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3) డిజిటల్ రిలీజ్ కు ముందే ఒక పెద్ద లీగల్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఓటీటీ రిలీజ్ పై మద్రాస్ హైకోర్టు సంచలన స్టే ఇచ్చింది.

Published on: Jun 17, 2026, 21:01:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam 3 Telugu OTT Stay: మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి రెండు భాగాలు తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ మూడో భాగాన్ని మాత్రం తెలుగులో రీమేక్ చేయకుండా, నేరుగా మలయాళ వర్షన్ తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

Drishyam 3 Telugu OTT Stay: షాకింగ్.. దృశ్యం 3 తెలుగు ఓటీటీ రిలీజ్ లేనట్లే.. రేపే స్ట్రీమింగ్ అనగా కోర్టు స్టే.. ఏమైంది?
Drishyam 3 Telugu OTT Stay: షాకింగ్.. దృశ్యం 3 తెలుగు ఓటీటీ రిలీజ్ లేనట్లే.. రేపే స్ట్రీమింగ్ అనగా కోర్టు స్టే.. ఏమైంది?

జూన్ 18న (గురువారం) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. సరిగ్గా స్ట్రీమింగ్ కు కొన్ని గంటల ముందే ఈ సినిమా తెలుగు వర్షన్ పై కోర్టు స్టే ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Sripriya's Petition in Madras High Court | కోర్టుకెక్కిన డైరెక్టర్ శ్రీప్రియ..

'దృశ్యం' మొదటి భాగాన్ని తెలుగులో వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శ్రీప్రియ (Sripriya) రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దృశ్యం 3' తెలుగు హక్కులు తమకే చెందుతాయంటూ శ్రీప్రియ, ఆమె నిర్మాణ సంస్థ 'రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్' మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సినిమాను తెలుగు భాషలో రిలీజ్ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ శ్రీప్రియ, రాజ్ కుమార్ సేతుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండా, తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేయడం చట్టవిరుద్ధమని వారు వాదించారు.

High Court Order | కోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కే కుమారేష్ బాబు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు ముందే ప్రైవేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి తరపున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి నోట్ చేశారు.

"ప్రతివాదులకు నోటీసులు అందినప్పటికీ వారి తరపున ఎవరూ కోర్టుకు రాలేదు, కాజ్ లిస్ట్ లో కూడా వారి పేర్లు ప్రింట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ కాపీరైట్ హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే రెస్పాండెంట్స్, వారి సిబ్బంది లేదా అసైనీలు ఎవరూ కూడా 'దృశ్యం 3' సినిమాను తెలుగు వెర్షన్ లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం" అని కోర్టు స్పష్టం చేసింది.

కరోనా సమయంలో 'దృశ్యం 2' తెలుగు రీమేక్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది, అప్పుడు ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాలేదు. కానీ ఈ మూడో భాగాన్ని తెలుగులో రీమేక్ చేయకపోవడానికి అసలు కారణాలు ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.

తాజా కోర్టు ఆర్డర్ ప్రకారం.. రేపు (జూన్ 18న) 'దృశ్యం 3' మలయాళ ఒరిజినల్ వెర్షన్ తో పాటు ఇతర భాషల్లో రిలీజ్ అయినా, తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ వివాదం సద్దుమణిగాకే తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More